సాధారణంగా ఎంతో మంది సినీ సెలబ్రిటీలు తెరపై హీరో హీరోయిన్లుగా సందడి చేస్తున్నప్పటికీ తెర వెనక కూడా చాలామంది ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేస్తుంటారు.ఈ క్రమంలోనే చాలామంది వారు సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తూ ఉంటారు.
ఇకపోతే చాలామంది సెలబ్రిటీలు పెద్ద ఎత్తున ఎన్జీవో సంస్థలను కూడా నిర్వహిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఇక చాలామంది హీరోయిన్లు పెద్ద ఎత్తున షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు వెళుతూ సందడి చేస్తుంటారు అయితే తాజాగా ఒక హీరోయిన్ మాత్రం అందుకు భిన్నంగా ఒక అనాధ ఆశ్రమానికి వెళ్లి సందడి చేశారు.
ఇలా హైదరాబాద్ సమీపంలోని ఒక అనాధ ఆశ్రమంలో నటి లావణ్య త్రిపాఠి( Lavanya Tripati ) సందడి చేశారు.ఇలా అనాధాశ్రమానికి వెళ్లినటువంటి ఈమె అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో కలిసి ఎంతో సరదాగా ముచ్చటించడమే కాకుండా స్వయంగా వారికి భోజనాలు వడ్డించి పిల్లలతో కలిసి ఆమె కూడా భోజనం చేశారు.ఇక అనాధాశ్రమానికి తనదైన శైలిలో సహాయం కూడా అందించారు.ఇలా అనాధాశ్రమంలో పిల్లలతో ఎంతో సరదాగా గడిపిన లావణ్య త్రిపాఠి పిల్లల ద్వారా తాను ఎన్నో విషయాలను నేర్చుకున్నాను అని సంతోషం వ్యక్తం చేశారు.
ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్నటువంటి ఈమె అనాధాశ్రమానికి వెళ్లి అక్కడ పిల్లలని సందడి చేయడమే కాకుండా వారితో ఈమె కూడా చాలా సరదాగా గడిపారని తెలుస్తోంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు ఈ ఫోటోలపై స్పందిస్తూ లావణ్య త్రిపాఠి మంచి మనసు పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక లావణ్య త్రిపాటి సినిమాల విషయానికి వస్తే అందాల రాక్షసి ( Andala Rakshashi )సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకోలేకపోయినా ఇండస్ట్రీలో హీరోయిన్గా గుర్తింపు పొందారు.ప్రస్తుతం ఈమె సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు.