కేంద్ర ప్రభుత్వంపై మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.కేంద్రం తీరుతో రైతుల ఆదాయం తగ్గిందని ఆరోపించారు.
గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని కేంద్రం డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు.రాష్ట్ర అభివృద్ధిని గవర్నర్ అడ్డుకుంటున్నారన్న మంత్రి హరీశ్ రావు రాష్ట్రానికి రావాల్సిన ఉద్యోగాలను గవర్నర్ అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఫారెస్ట్ యూనివర్సిటీని తెచ్చామన్నారు.దేశ సంపద బయటకు పోవడానికి బీజేపీనే కారణమని ఆరోపించారు.
నిజాన్ని ప్రజలకు తెలపకపోతే అబద్ధం రాజ్యమేలుతుందని తెలిపారు.