చంద్రుడిపై 3D ప్రింటింగ్ టెక్నాలజీతో బిల్డింగ్స్ కట్టాలని చైనా ప్లాన్!

చైనా ( China ) మంచి దూకుడుమీద వుంది.అవును, చంద్రుడిపైన ( Moon ) జీవించడానికి ఉరకలు వేస్తోంది.

 China To Test 3d Printing To Construct Buildings On The Moon-TeluguStop.com

ఇందుకోసం సరికొత్త ఇన్నోవేటివ్ ఐడియాలు చేస్తోంది.ఇందులో భాగంగా చంద్రుడి ఉపరితలంపై భవనాలను నిర్మించేందుకు 3D ప్రింటింగ్ టెక్నాలజీని( 3D Printing Technology ) పరిశీలించాలని నిర్ణయించింది.

ఈ భవనాలను అక్కడ దొరికే మట్టితో తయారుచేసిన ఇటుకలతో నిర్మించాలని డ్రాగన్ కంట్రీ యోచిస్తోంది.

చంద్రుడిపై ప్రజలు ఎక్కువ కాలం నివసించేలా చైనీస్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని ఇటీవల చైనీస్ ఇంగ్లీష్ పోర్టల్ చైనా డైలీ వెల్లడించింది.

ఈ ప్రయత్నాలు సఫలమైతే చంద్రునిపై కావాల్సినన్ని స్థావరాలను ఏర్పరచుకోవడం కుదురుతుంది.అలాగే ఇక్కడ అన్వేషణలకు కూడా బాటలు వేసినట్లు అవుతుంది.ఈ భవనాలు నిర్మించేందుకు త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ తక్కువ మెటీరియల్ వాడేలా చేస్తుంది.ఫలితంగా క‌న్‌స్ట్ర‌క్ష‌న్ మెటీరియల్ వేస్ట్ కాదు.

2020లో చైనీస్ చాంగ్ 5 మిషన్ చంద్రుడు పైనుంచి ఆల్రెడీ మట్టిని భూమి పైకి తీసుకొచ్చింది.దీంతో ఇటుకలు ఎలా తయారు చేయాలో చైనా ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.అంతేకాకుండా, 2030 నాటికి చంద్రునిపైకి వ్యోమగాములను పంపాలని చైనా ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ సైంటిస్ట్ వూ వీరెన్ చైనా చంద్రుని పై నివసించేందుకు చేస్తున్న ప్రణాళికలను ఓ మీడియా వేదిక ద్వారా వెల్లడించారు.

ఆయన ప్రకారం, చంద్రునిపై ఉన్న పదార్థాలను ఉపయోగించి స్టేషన్లను నిర్మించడం కంటే ఉత్తమ మార్గం ఏదీ లేదు.భూమి నుంచి అవసరమైన అన్ని నిర్మాణ సామగ్రిని రవాణా చేయడం చాలా ఖర్చుతో పాటు భారంతో కూడుకున్న పని కాబట్టి ప్రస్తుతానికి ఈ మార్గాన్ని చైనా అన్వేషిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube