సోషల్ మీడియాలో అనునిత్యం రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.అందులో కొన్నింటిని చూసినపుడు ఒళ్ళు మండిపోతుంది.
నేటి యువత మరీ పెచ్చుమీరిపోయి ప్రవర్తిస్తున్నారు అనడానికి ఈ వీడియోనే ఉదాహరణ.డ్రైవింగ్( Driving ) అంటే ఎవరికి ఇష్టం ఉండదు.
ఇక కారు డ్రైవింగ్ అంటే ఇక చెప్పనక్కలేదు.అయితే ఎలాంటి వెహికల్ అయినా రోడ్డుపైన ప్రయాణించేటప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి.
లేదంటే మనం ఇబ్బందులు పడడంతో పాటు ఎదుటివారు కూడా ఇబ్బందులు పడుతుంటారు.
అదే డ్రైవింగ్ నిర్లక్ష్యంగా చేస్తే ప్రాణాలే పోతాయి.అయితే నేటి యువతకి ఇవేమి పట్టవు.వారి శునకానందమే వారికి ఆనందం.
చాలామంది పోకిరి కుర్రాళ్లు డ్యాష్‌బోర్డుపై కాళ్లు పెట్టి దర్జాగా కూర్చొని డ్రైవింగ్ చేస్తూ వుంటారు.అయితే, అది ఆ క్షణానికి అది థ్రిల్లింగ్ కావచ్చు కానీ, పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగితే.
అలా కూర్చున్న వారికే ఎక్కువ ప్రమాదం ఇక్కడ జరుగుతుంది.అలా చాచిపెట్టిన కాళ్లు కాస్త ఎక్కడికక్కడ విరిగిపడి, మడతపడే ప్రమాదం ఉంది.
కాగా ఈ కోవకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కారు క్రాష్ టెస్ట్‌కు( crash test car ) సంబంధించిన వీడియో అని కొందరు అంటున్నారు.నిజానిజాలేమిటో తెలియదు గాని, క్రాష్ టెస్ట్‌లో భాగంగా కారు ముందు సీటులో మనిషి రూపంలో ఉన్న ఒక బొమ్మను కూర్చోబెట్టారు అని కొందరు అంటున్నారు.అవును, సాధారణంగా కొందరు తమ కాళ్లను డ్యాష్ బోర్డుపై( dash board ) పెట్టి చేతులతో మొబైల్ ఫోన్లను ఆపరేట్ చేస్తుంటారు.
అచ్చం అలాగే ఈ బొమ్మను కూడా సెట్ చేసినట్టు కనబడుతోంది.అయితే ఈ విషయం మాత్రం కొంతమంది నెటిజన్లు గమనించడం అటుంచితే….కామెంట్ల రూపంలో తిట్ల దండకాన్ని అందుకున్నారు.అలా డ్రైవ్ చేయడం ఎంతమాత్రమూ సేఫ్ కాదని అంటున్నారు.