ఎట్టకేలకు వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ( Privatization of Vizag Steel ) విషయంలో కేంద్రం ఒక అడుగు వెనకకు వేసింది.ఈ దిశగా కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి పగ్గం న్ సింగ్( Minister Paggam N Singh ) కులస్తే కీలక వ్యాఖ్యలు చేశారు,, ఈరోజు కైతే ప్రైవేటీకరణ విషయంలో ముందుకెళ్లే ఆలోచన కేంద్రానికి లేదని ప్లాంట్ ను పూర్తి సామర్థ్యం మేరకు పనిచేసేలాగా ప్రయత్నాలు చేస్తున్నామని ఆ దిశగా ఆర్ ఐ ఎన్ ఎల్ ను బలోపేతం చేస్తున్నామని చెప్పుకొచ్చారు… మంత్రి ప్రకటనతో ధర్నా చేస్తున్న ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేశారు విశాఖ నగరం అంతటా కూడా ఈ ప్రకటన తో ఆనందం వ్యక్తమవుతుంది.

ఇప్పుడు ఈ ప్రకటన తాలూకూ క్రెడిట్ మాదంటే మాది అంటూ రాజకీయ పార్టీలు క్లెయిమ్ చేసుకుంటున్నాయి… తమ పార్టీ ఆంధ్రలో అడుగు పెట్టి బిడ్ వేయడానికి ముందుకు రావడం వల్లే కేంద్ర వెనక వెనకకు తగ్గిందని తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేసిందంటూ బారాస నేతలు చెప్పుకుంటున్నారు ….ఇంతకాలం ఈ రాష్ట్రంలో ఉన్న అధికార ,ప్రతిపక్షాలు ఈ విషయం మీద మాట్లాడలేదని తమ పార్టీ బలంగా ముందుకు తీసుకెళ్లడం వల్లనే కేంద్రం పై ఒత్తిడి పెరిగి ఈ దిశగా నిర్ణయం తీసుకుందంటూ గులాభి నాయకులు చెప్పుకుంటున్నారు.అయితే అధికార పార్టీ నేతల వెర్షన్ మరోలా ఉంది ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేము అసెంబ్లీ తీర్మానం కూడా ప్రవేశపెట్టామని, తమ నాయకుడు జగన్ ( jagan ) ఢిల్లీ వెళ్లే ప్రతిసారి ఈ విషయంపై మోడీ( Modi )ని ఒప్పించే ప్రయత్నం చేస్తుంటారని, జగన్ ప్రయత్నం వల్లనే కేంద్రం ఈ నిర్ణయం ఈ నిర్ణయం తీసుకుంది అంటూ అధికార పక్ష నేతలుచెప్తున్నారు.

ఈ విజయం పై జనసైనికులు కూడా క్లెయిమ్ చేసుకుంటున్నారు తమ నాయకుడు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగిన రోడ్డు మ్యాప్ లో ఈ స్టీల్ ప్లాంట్ నిర్ణయం వెనక్కి తీసుకోవడం కూడా ఉంది అని ఇటీవల పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) జరిపిన చర్చల్లో కూడా దీనికి ప్రదానం గా చర్చించారని అందుకే కేంద్ర ప్రభుత్వం ఏ విషయంలో వెనుకంజ వేసింది అంటూ జనసేన చెప్పుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం నిర్ణయంలో ఘనత ఎవరిదైనా అంతిమంగా ప్రజలకు మేలు జరిగి వేలాది మందికి ఉపాధి కల్పించే ఈ సంస్థ నిలబడితే చాలని సాధారణ జనం అనుకుంటున్నారు