టీడీపీ లో స్టిక్కర్ పాలిటిక్స్ ! నాని ప్లేస్ లో చిన్ని 

ఏపీ రాజకీయాలు వేడెక్కాయి.ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో,  అధికార పార్టీ వైసిపి పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను ప్రజలకు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

 Sticker Politics In Tdp! A Child In Nani's Place , Kesineni Nani, Kesineni Chin-TeluguStop.com

దీనిలో భాగంగానే మా నమ్మకం నువ్వే జగన్( Jagan ) అనే పేరుతో వినూత్నంగా ప్రజల వద్దకు వెళ్తోంది.అంతేకాదు ఆయా ఇళ్లలోని వారి అనుమతితో జగన్ ఫోటోతో కూడిన స్టిక్కర్ ను ఆయా ఇళ్లకు అంటించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.

దీనికి పోటీగా టిడిపి, జనసేనలు స్టిక్కర్ అంటించే కార్యక్రమానికి తెరతీశాయి.వైసిపి మా నమ్మకం నువ్వే జగన్ అనే స్టిక్కర్లను అంటిస్తుండగా.

జగన్ స్టిక్కర్లను అంటించిన  ప్రతి ఇంటి వద్ద టిడిపి స్టిక్కర్లు అంటించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది .సైకో పోవాలి – సైకిల్ రావాలి,  మళ్లీ ముఖ్యమంత్రి చంద్రబాబు( Chandrababu ) అవ్వాలి అనే స్లోగన్ తో టిడిపి నాయకులు స్టిక్కర్లను అంటిస్తున్నారు.

Telugu Ap, Janasena, Kesineni Chinni, Kesineni Nani, Manammakam, Pavan Kalyan, V

ముఖ్యంగా విజయవాడలో ఈ కార్యక్రమం ఉదృతంగా సాగుతోంది.జనసేన పార్టీ కూడా టిడిపి( TDP ) బాటలోనే వెళ్తోంది.మా నమ్మకం పవన్ .మాకు వద్దు జగన్ అని పవన్ కళ్యాణ్ ఫోటోతో ముద్రించిన స్టిక్కర్లను విజయవాడలో ప్రతి ఇంటికి అంటించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.ఈ విధంగా మూడు పార్టీలు స్టిక్కర్ పాలిటిక్స్ తో విజయవాడ రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది.ఇది ఇలా ఉంటే.ఈ కార్యక్రమం లోనే టీడీపీ సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని( MP Keshineni Nani )అంశం తెరపైకి వచ్చింది.ముఖ్యంగా టిడిపి అంటిస్తున్న స్టిక్కర్లలపై  ఎంపీ కేశినేని నాని ఫోటోలు కనిపించకపోవడం,  దానికి బదులుగా నాని సోదరుడు కేశినేని చిన్ని ఫోటో ముద్రించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

స్టిక్కర్లపై  ఒకపక్క స్థానిక ఎమ్మెల్యే లేదా నియోజకవర్గ ఇన్చార్జి ఫోటోను ముద్రించగా,  మరోవైపు కేసు  చిన్ని ఫోటోను ముద్రించారు.

Telugu Ap, Janasena, Kesineni Chinni, Kesineni Nani, Manammakam, Pavan Kalyan, V

అలాగే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ , టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, ఏపీ టిడిపి అధ్యక్షుడు కింజరాపు( AP TDP President Kinjarapu ) అచ్చెన్న నాయుడు , లోకేష్ ఫోటోలను ఈ స్టిక్కర్లపై ముద్రించారు.కానీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న కేసునేని నాని ఫోటో ఆ స్టిక్కర్లపై లేకపోవడంతో,  నానిని టిడిపి దూరం పెట్టిందనే చర్చ మొదలైంది.రాబోయే ఎన్నికల్లో నానికి బదులుగా కేశినేని చిన్నికి ఎంపీ టికెట్ ఇవ్వబోతున్నారనే విషయాన్ని ఈ స్టిక్కర్ల ద్వారా టిడిపి అధినాయకత్వం స్పష్టం చేసిందనే చర్చ ప్రస్తుతం విజయవాడ రాజకీయాల్లో జరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube