ఏపీలో నయా ట్రెండ్ స్టిక్కర్ల రాజకీయం

ఏపీలో ఇప్పుడు స్టిక్కర్ల రాజకీయం మొదలైంది… మా భవిష్యత్తు నువ్వే జగన్ పేరిట భారీ స్థాయిలో ప్రజా సర్వే కార్యక్రమానికి వైసీపీ( YCP ) ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.ఈ కార్యక్రమంలో భాగంగా గృహ సారధులు, సచివాలయం కన్వీనర్లు ,ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రజల అభిప్రాయం తెలుసుకునే కార్యక్రమం నిన్న అటహాసంగా మొదలైంది.

 Janasena Opposite Compaign For Ma Nammakam Nuvve Jagan , Janasena , Jagan, Ycp,-TeluguStop.com

ప్రతి నియోజకవర్గంలోనూ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.ప్రతి ఇంటికి వెళ్లి వారి సాధకబాదాకాలు వింటూ మా నమ్మకం నువ్వే జగన్ అనే స్టిక్కర్లను అంటిస్తున్నారు… ఈ స్టిక్కర్లు అంటించుకోకపోతే పథకాలు ఆపేస్తారని వాలంటీర్లు భయపెట్టడం వలన ప్రజలు స్టిక్కర్లు అంటించుకోవడానికి ముందుకు వస్తున్నారు తప్ప స్వచ్ఛందంగా కాదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి అయితే ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రతిగా ఇప్పుడు జనసేన పార్టీ( Janasena party ) వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టింది తిరుపతిలో జనసేన నేత కిరణ్ రాయల్( Kiran Royal ) పవన్ పేరిట ముద్రించిన స్టిక్కర్లను పోటాపోటీగా ఇంటింటికి అంటిస్తున్న వైనం హాట్ టాపిక్ గా మారింది.

మాకు నమ్మకం లేదు జగన్ మా నమ్మకం పవన్ పేరిట అధికారి పార్టీ స్టిక్కర్లు అంటించిన ప్రతి ఇంటికి వెళ్లి ఈ స్టిక్కర్లను అంటించడం ఆసక్తిని కలిగిస్తుంది.

Telugu Jagan, Janasena, Kiran Royal, Pawan Klayan-Telugu Political News

నాలుగు సంవత్సరాలఈ ప్రభుత్వం చేసిన అస్తవ్యస్త పాలనతో ప్రజలు విసిగిపోయారని ప్రభుత్వాన్ని ఇంటికి సాగనపడానికి ప్రజలు ఎదురుచూస్తున్నారని ఇలాంటి సమయంలో ప్రజలకు ఏదో గొప్ప ఉపకారం చేసినట్టుగా ఇంటింటికి తిరిగి ఇలా స్టిక్కర్ లు అతికించడం హాస్యాస్పదంగా ఉందంటూ జనసేన నేత కిరణ్ రాయల్ విమర్శించారు సంవత్సరంలో మూడు రోజులు బటన్ నొక్కడం మిగతా 362 రోజులు ప్రజలను దోచుకు తినడం తప్ప ఈ ప్రభుత్వం ఇంకేం చేయలేదని మరి ప్రజలు జగన్ ను ఎలా నమ్ముతారు అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు.ప్రజాధనంజీతం గా తీసుకునే వాలంటీర్లను పార్టీ కార్యక్రమాలకు ఎలా ఉపయోగించుకుంటారు అంటూ ప్రతిపక్షాల ప్రశ్నిస్తునా కూడా అధికార పార్టీ పట్టించుకున్నట్లుగా లేదు.ఎక్కడ చూసినా దగ్గరుండి మరి వాలంటీర్లు, గృహసారదు లను ఇంటింటికి తిప్పుతున్న వైనం విమర్శల పాలు అవుతుంది జనసేన నిరసన కార్యక్రమం పై ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube