ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్( Allu Arjun ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అల్లు వారసుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అరవింద్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న పాన్ ఇండియా హీరోలలో ఒకరిగా రాణిస్తున్నారు.
ఇకపోతే నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు( Allu Arjun Birthday ) అన్న విషయం మనందరికీ తెలిసిందే.ఈ సందర్భంగా అల్లు అర్జున్ కి సంబంధించిన విషయాల గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం.2003లో విడుదలైన మొదటి సినిమా గంగోత్రి సినిమాతో పేక్షకులను పలకరించిన అల్లు అర్జున్ ఆ మొదటి సినిమాతోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు.
ఆ తర్వాత తెలుగులో ఆర్య, బన్నీ, హ్యాపీ, రేసుగుర్రం, జులాయి, దేశముదురు, దువ్వాడ జగన్నాథం, సన్నాఫ్ సత్యమూర్తి, వేదం, రుద్రమదేవి అలాంటి మంచి మంచి సినిమాలు నటించి హీరోగా అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరో రేంజ్ కి ఎదిగారు అల్లు అర్జున్.2021 లో విడుదలైన పుష్ప సినిమాతో( Pushpa ) పాన్ ఇండియా హీరోగా మారిన విషయం తెలిసిందే.ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది.
కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా ఇతర సినీమా ఇండస్ట్రీలో కూడా అల్లు అర్జున్ కీ విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పడింది.

ఇకపోతే అల్లు అర్జున్ మంచి డాన్సర్ అన్న సంగతి మనందరికీ తెలిసిందే.అల్లు అర్జున్ డాన్స్ కీ ప్రియమైన అభిమానులు ఉన్నారని చెప్పవచ్చు.ఇకపోతే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ది బెస్ట్ డాన్సర్ ఎవరు అని ప్రశ్నిస్తే అల్లు అర్జున్ పేరు తప్పకుండ వినిపిస్తూ ఉంటుంది.
బన్నీ కూడా డాన్స్ పై తనకున్న ఆసక్తితో కుటుంబంలో జరిగే వేడుకల్లో ప్రతిభ చూపేవాడు.అల్లు అర్జున్ విద్యార్థిగా ఉన్నప్పుడు పలు డ్యాన్స్ పోటీల్లో పాల్గొన్నారు.

కానీ బన్నీ ఏ ఒక్కదాంట్లో కూడా గెలవలేదు.డ్యాన్స్ విషయంలో సినీ రంగంలో తాను ఎవరితోనూ పోటీ పడనని తెలిపిన బన్నీ ప్రొఫెషనల్ డ్యాన్సర్లతో పోటీపడి డాన్స్ సిద్ధంగా ఉంటానని తెలిపారు.అలాగే మంచి నటుడితో పాటు ప్రొఫెషనల్ డ్యాన్సర్ అని అనిపించుకోవడం తనకెంతో ఇష్టమని చెప్పుకొచ్చారు అల్లు అర్జున్.దాంతో తాను స్కూల్ కాలేజ్ డేస్‌లో డ్యాన్సర్‌గా ఓడినప్పుడు నిరుత్సాహపడకుండా మరింత ఫోకస్‌తో పనిచేసి వెండితెరపై గొప్ప డ్యాన్సర్‌గా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.