బింబిసార ( Bimbisara ) .ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
బింబిసార సినిమాతో నందమూరి కళ్యాణ్ రామ్ ( Nandamuri Kalyan Ram ) తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.గత ఏడాది వచ్చిన ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ట ( Vassisht Mallidi ) డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే.
మరి బింబిసార బ్లాక్ బస్టర్ హిట్ తో ఈ డైరెక్టర్ పేరు మారుమోగి పోయింది.
మరి అలాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత ఈ డైరెక్టర్ కు బిగ్ ప్రొడక్షన్ హౌస్ లలో భారీ ఆఫర్స్ వస్తున్నాయి.
అయితే ఈయన నెక్స్ట్ మూవీ ఇంకా ప్రకటించలేదు.బింబిసార సీక్వెల్ ఉంటుంది అని అయితే ప్రకటించినప్పటికీ ఇంకా సీక్వెల్ పై అఫిషియల్ అప్డేట్ అయితే రాలేదు.ఇదిలా ఉండగా గత రెండు రోజులుగా నెట్టింట ఈయన నెక్స్ట్ సినిమా గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి.
మల్లిడి వశిష్ట తన నెక్స్ట్ సినిమాను మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi) తో చేయబోతున్నాడు అంటూ గత రెండు రోజులుగా నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.మరి తాజాగా ఈ వార్తలపై క్లారిటీ తెలుస్తుంది.ఈ వార్తలలో ఎలాంటి నిజం లేదని.
ఇవి కేవలం పుకార్లు మాత్రమే అని తెలుస్తుంది.బింబిసార వంటి హిట్ తర్వాత మల్లిడి వశిష్ట ప్రజెంట్ తన నెక్స్ట్ సినిమా కథ రెడీ చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడని టాక్.
దీంతో ఇవన్నీ ఒట్టి పుకార్లుగానే మిగిలి పోయాయి.ఇక మెగాస్టార్ (Megastar) సినిమాల విషయానికి వస్తే ప్రజెంట్ చిరు భోళా శంకర్ (Bhola Shankar) సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.ఈ సినిమాను మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తుండగా.అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.కీర్తి సురేష్ చిరు చెల్లెలుగా నటిస్తుంది.
మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమా ఆగస్టు 11న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.