స్మార్ట్ ఉత్పత్తులపైన జనాలకి రోజురోజుకీ మక్కువ పెరిగిపోతోంది.దీనికి కారణం టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు.
మరీ ముఖ్యంగా యువత ఇలాంటి స్మార్ట్ ఉత్పత్తులను కొనుగోలు చేయడంలో ముందుంటున్నారు.అది స్మార్ట్ ఫోన్( Smart phone ) కావచ్చు, స్మార్ట్ వాచ్ కావచ్చు, స్మార్ట్ టీవీ కావచ్చు, స్మార్ట్ లైట్స్ కావచ్చు… ఇలా ప్రతిదీ మార్కెట్లో విరివిగా అమ్ముడుపోతున్నాయి.
ఈ క్రమంలోనే పెరిగిన టెక్నాలజీ ( Technology )వినియోగం ద్వారా చాలామంది స్మార్ట్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ప్రముఖ మార్కెట్ పరిశోధనా సంస్థ కౌంటర్‌పాయింట్ తాజాగా వెల్లడించింది.
ఈ మార్పు ముఖ్యంగా కరోనా తరువాత మొదలైందని చెప్పుకోవచ్చు.కోవిడ్ తరువాత పెరిగిన ప్రీమియమైజేషన్ ( Premiumization ) కారణంగా మొబైల్‌ఫోన్ విక్రయాల్లో స్మార్ట్‌ఫోన్‌ల వాటా 2019లో 59 శాతం ఉంటే 2022లో అది 72 శాతానికి పెరగడం కొసమెరుపు.అదే విధంగా స్మార్ట్ టీవీల వాటా 52 శాతం నుంచి 90 శాతానికి పెరగడం విశేషం.
అదేమాదిరి స్మార్ట్ ఏసీ, స్మార్ట్ వాషింగ్ మెషీన్( Smart washing machine ), స్మార్ట్ వాటర్ ప్యూరిఫైయర్ల వాడకం కూడా గణనీయంగా పెరుగుతోంది.ఇంటర్నెట్ కనెక్టివిటీతో పాటు స్మార్ట్‌ఫోన్ యాప్‌ల ద్వారా నియంత్రించబడే ప్రీమియం ఉత్పత్తుల అమ్మకాలు భారీగా పుంజుకున్నాయి.
కరోనాకు ముందు నాటితో పోలిస్తే ప్రస్తుతం స్మార్ట్ ఉత్పత్తుల వాాటా మొత్తం అమ్మకాల్లో రెట్టింపు అయిందని పరిశ్రమ వర్గాలు కూడా చెబుతున్నాయి.కరోనాకు ముందు స్మార్ట్ ఉత్పత్తులకు, సాధారణ ఉత్పత్తుల మధ్య ధరల వ్యత్యాసం గతంలో రూ.3,000-4,000 మధ్య ఉండగా, ఇప్పుడు రూ.500-1000కి తగ్గడం గమనించవచ్చు.ఇది కూడా స్మార్ట్ ఉత్పత్తుల వినియోగం పెరిగేందుకు దోహదపడుతోందని హైయర్ ఇండియా అధ్యక్షుడు సతీష్ ఎన్ఎస్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.హైస్పీడ్ ఇంటర్నెట్ లభ్యత, 5జీ సేవలు అందుబాటులోకి రావడం వంటివి కూడా స్మార్ట్ ఉత్పత్తులు పెరిగేందుకు కారణమని కౌంటర్‌పాయింట్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ శిల్పి జైన్ పేర్కొన్నారు.