బీజేపీ నాయకురాలు విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు.బండి సంజయ్ అరెస్ట్ పై స్పందించిన ఆమె పేపర్ లీక్ అంశంపై ప్రశ్నించినందుకే అరెస్ట్ చేశారని మండిపడ్డారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్, ఎస్ఎస్సీ పేపర్ లీక్స్ పై బండి సంజయ్ ప్రశ్నించారని, ఈ క్రమంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే అరెస్ట్ చేశారని విజయశాంతి తెలిపారు.బండి సంజయ్ అరెస్ట్ కు సంఘీభావంగా వెళ్తున్న తనను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని వెల్లడించారు.