మరో చరిత్ర సినిమా( maro charitra ) ఎంత మందికి గుర్తుంది చెప్పండి.ప్రేమ అంటే ఇలా కూడా ఉంటుందా అని ఒక జెనరేషన్ కి పరిచయం చేసిన ఈ చిత్రాన్ని మర్చిపోవడం ఎవరికీ సాధ్యం చెప్పండి.
ఈ సినిమాలో కమల్ హాసన్( Kamal Haasan ) మరియు సరిత( Saritha ) హీరో హీరోయిన్స్ గా నటించగా సినిమా క్లైమాక్స్ లో ఈ ఇద్దరు చనిపోతారు.ఈ ఒక్క సన్నివేశాన్ని ఆదర్శంగా తీసుకొని పదుల సంఖ్యలో ప్రేమికులు ఇంట్లో తమ పెళ్ళికి ఒప్పుకోవడం లేదు అని ఆత్మ హత్యలు చేసుకున్నారు.
ఈ సినిమాను తెరకెక్కించిన బాలచందర్( Balachander ) సైతం ప్రేమికులపై ఈ చిత్రం చూపించిన ప్రభావానికి ఎంతో బాధ పడ్డాడు.సినిమా ఆసాంతం ఎక్కడ బోర్ కొట్టకుండా ఒక అద్భుతమైన ఫీల్ క్యారీ అయ్యేలా ఉంటుంది.
అయితే ఈ సినిమా చూపించిన ప్రభావానికి చాల మంది కమల్ హాసన్, సరిత ఇద్దరు నిజంగానే ప్రేమలో ఉన్నారని అపోహ పడ్డారు.ఇప్పటి లాగ సోషల్ మీడియా అంతగా లేకపోయినా మీడియాలో సినిమా పత్రికల్లో వీరి గురించిన అనేక కథనాలు వచ్చాయి.జనాలు కూడా అవి నిజమని నమ్మేవారు.కాగా నిజానికి వీరిద్దరి మధ్య ఎలాంటి బంధం లేదు.కానీ జనాలు తమ గురించి ఎంత ఎక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది అని కమల్ హాసన్ సరితకు చెప్పడం తో ఆమె కూడా సైలెంట్ గా ఉండిపోయింది.ఎన్నో రోజుల పాటు వచ్చిన ఈ వార్తలను ఇద్దరు ఖండించలేదు.
ఇక ఈ సినిమా దర్శకుడు అయినా బాల చందర్ కి సరిత కు మధ్య కూడా ఒక బంధం ఉండేది అని అప్పట్లో గాసిప్స్ బాగా వచ్చాయి.అంతే కాదు అటు బాల చందర్ ఇటు కమల్ హాసన్ మధ్యలో సరిత చాల రోజుల పాటు నలిగిపోయింది కూడా కొంత మంది చెప్పుకునే వారు.నిజానిజాలు పెద్దగా ఎవరికీ తెలియకపోయిన అదే వాస్తవమని భ్రమలో కూడా ఉండేవారు.ఇక ఈ సంగతి కాసేపు పక్కన పెడితే మరో చరిత్ర సినిమా తర్వాత అటు కమల్ కి ఇటు సరిత కు మంచి ఆఫర్స్ రావడం జరిగింది.
పైగా ఇద్దరు కలిసి చాల సినిమాల్లో నటించారు.అందుకే ప్రేమ వార్తల జోరు కూడా అలాగే పెరిగింది.