ఈటీవీ లో వచ్చిన జబర్దస్త్ షో ( Jabardasth Show )ద్వారా యాంకర్ అనసూయ( Anasuya ) పాపులర్ అయ్యారు.ఈమె ఈ షో ద్వారానే చాలా సినిమాల్లో నటించే అవకాశాలను కూడా అందుకుంది… ముఖ్యం గా రామ్ చరణ్( Ram Charan ) హీరోగా వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మ అత్త గా నటించి ప్రేక్షక ఆదరణ పొందిందనే చెప్పాలి…అయితే అనసూయ తరుచూ వివాదాల్లో నిలుస్తూ ఉంటుంది… ఎప్పుడు ఎదో ఒక కామెంట్ చేస్తూ ఆమె ట్రోల్స్ కి గురి అవుతూ ఉంటుంది…
ఇప్పుడు కూడా ఒక రకమైన ట్రోలింగ్ కి గురి అవుతూ ఉంది అదేంటంటే జనాలు తనని ఆంటీ( aunty ) అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇలా ఆంటీ అంటూ కమెంటు చేయడం ఇది కొత్తమే కాదు.ఇంతకుముందు కూడా ఇలాంటి పనులు చేసిన ట్రోలర్స్ కి ఆవిడ సమాధానం గా వాళ్ల మీద కేసులు పెట్టే ప్రయత్నం చేసింది… అయితే ఇప్పుడు ఎందుకు ట్రోలింగ్ కి గురి అవుతుంది అంటే లైగర్ మూవీ ( Liger Movie )మీద అనసూయ చేసిన పరోక్ష కామెంట్ వివాదాస్పదమయ్యాయి… అమ్మను తిట్టిన పాపం ఇలా వెంటాడింది.అందుకే లైగర్ ప్లాప్ అయ్యింది అనే అర్థంలో అనసూయ ట్వీట్ చేశారు….
అనసూయ చర్యతో ఆగ్రహానికి గురైన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆమెపై ట్రోలింగ్ షురూ చేశారు.ఆంటీ అనే ట్యాగ్ ట్రెండ్ చేశారు.ఆంటీ అని పిలవడం కూడా వేధింపుల క్రిందికి వస్తుంది.నేను కేసు పెడతా అంటూ అనసూయ హెచ్చరించారు….అయినా కొందరు నెటిజెన్స్ తగ్గలేదు.దాదాపు మూడు రోజులు అనసూయ- నెటిజెన్స్ మధ్య మాటల యుద్ధం జరిగింది…అనసూయ కొందరి మీద సైబర్ క్రైమ్ విభాగంలో కంప్లైంట్ చేసింది.
అయితే ఇదంతా చూసిన జనాలు ఆంటీ అని పిలిచినందుకే కంప్లైంట్ చేస్తారా అంటూ ముక్కున వేలు వేసుకుంటున్నారు…
.