రాజకీయ వ్యూహ కర్తగా ప్రశాంత్ కిషోర్( Prashant Kishor ) దేశం మొత్తానికి తెలుసు.తన అద్భుతమైన వ్యూహాలతో తాను పనిచేసే పార్టీకి విజయం కట్టబెట్టే ఈయన అత్యంత విజయవంతమైన పొలిటికల్ వ్యూహ కర్త గా పేరుగాంచారు.
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ కి, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy )కి దక్కిన విజయాల వెనుక ప్రశాంత్ కిషోర్ పాత్రను తక్కువ చేసి చూడలేం … ప్రచారం దగ్గరనుంచి పోలింగ్ మేనేజ్మెంట్ వరకు పూర్తిస్థాయి ప్లానింగ్ ఇతని ప్రత్యేకత.ఇప్పుడు వ్యూహ కర్త పాత్ర నుంచి పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందే ప్రయత్నం లో ఉన్నారు .తన స్వంత రాష్ట్రం బీహార్లో ఇప్పుడు “జన్ సూరాజ్ ( Jan Suraj Abhiyan )పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారు.
ఇటీవల మీడియాతో మాట్లాడిన ఆయన దేశంలో ఉన్న పార్టీలన్నీ కలిసినా బిజెపిని ఓడించడం అంత సులువు కాదంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి … బిజెపి( BJP ) చుట్టూ మూడు బలమైన కవచాలు ఉన్నాయని అందులో కనీసం రెండిటిని చేదిస్తే తప్ప బిజెపిని ఓడించడం కుదరదంటూ ఆయన చెప్పుకొచ్చారు., హిందుత్వ, జాతీయత , సంక్షేమం.హిందువులను ఏకతాటిపైకి తీసుకురావట.
,.మెజారిటీ జనాలలో జాతీయత భావన పెంపొందించడం, సంక్షేమ పథకాలు అమలు చేయడం ఈ మూడు సూత్రాలను బలంగా పాటించడం వల్ల భాజపా చాలా బలంగా నిలబడిందని ఈ భావజాలాన్ని ఓడించాలంటే గాంధీయవాదం ,అంబేద్కర్ ఇజం ,కమ్యూనిజం, వంటి సైద్దాంతిక భావజాలాలు ఒక్కటిగా కలిసి నిలబడితే తప్ప భాజపాను ఓడించడం సాధ్యం కాదని.
ప్రతిపక్ష పార్టీలు ఈ మధ్య తరచుగా కలుస్తూ ఐక్యత కోసం ఆలోచనలు చేస్తున్నాయని అయితే కలవాల్సింది పార్టీలు కాదంటూ భావజాలాలు కలవాలని బలమైన సైద్దాంతిక భావజాలాలు కలిస్తేనే బిజెపిని ఓడించడం కుదురుతుంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు .మరి దేశవ్యాప్తంగా ఎన్నికల విధానాలపై ప్రజల ఆలోచన విధానాలపై పూర్తిస్థాయి అధ్యయనం చేసిన పొలిటికల్ వ్యూహకర్తగా ఆయన ఆలోచన అంత తేలికే తీసి పారేయ గలిగింది కాదు మరి ఆయన సూచనలు ప్రతిపక్షాలు ఏ మేరకు పాటిస్తాయి వాటికి ఏమాత్రం ఆదరణ దక్కుతుందో రానున్న ఎన్నికల్లో తేలిపోతుంది
.