ఏదైనా ఒక పోలిటికల్ పార్టీకి కంచుకోటగా ఉండే నియోజికవర్గాలు కొన్ని ఉంటాయి.అలాంటి నియోజిక వర్గాల్లో కొంతమంది ప్రభావం అధికంగా ఉంటుంది.
ఉదాహరణకు పులివెందులకు వైఎస్ జగన్( Cm Jagan ), కుప్పం కు చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ), గుడివాడకు కొడాలి నాని( Kodali Nani ), గన్నవరంకు వల్లభనేని వంశీ( Vallabhaneni Vamsi ).ఇలా ఆ నియోజిక వర్గాలు వారికి అడ్డాగా ఉంటాయి.ఇలాంటి చోట వేరే అభ్యర్థులు రేస్ లో ఉన్న గెలుపు మాత్రం వీరిదే ఉంటుంది.అందుకే ఆ నియోజిక వర్గాల్లో వీరితో పోటీకి దిగేందుకు కూడా ప్రత్యర్థులు వెందుకడుగు వేస్తారు.
అయితే ఇప్పుడు సీన్ మారింది సొంత ఇలాఖలో గెలుపొందడం ఏముంది కిక్కు.శత్రు నియోజిక వర్గంలో గెలిచి చూపించినప్పుడే అసలైన సత్తా బయటపడుతుందనేది.ఇప్పుడు పోలిటికల్ లీడర్స్ జపిస్తున్న కొత్త మంత్రం.అందుకే ఒకరిపై ఒకరు సవాళ్ళు విసురుకుంటూ ఏపీలో పోలిటికల్ హీట్ రాజేస్తున్నారు.

చంద్రబాబు సొంత నియోజిక వర్గం అయిన కుప్పంలో కచ్చితంగా గెలుపొందాలని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ తొలి గెలుపు కుప్పంతోనే మొదలు కావాలని వైఎస్ జగన్ గట్టి పట్టుదలగా ఉన్నారు.అందుకే ఎప్పులేనంతగా వైఎస్ జగన్ కుప్పంపై గట్టిగా ఫోకస్ పెట్టారు.కుప్పంలో వైసీపీ అభ్యర్థినీ గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని ఓపెన్ ఆఫర్ కూడా ఇచ్చారు సిఎం జగన్.దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.కుప్పం సీటుపై వైఎస్ జగన్ ఏ స్థాయిలో గురిపెట్టారనే విషయం.ఇక చంద్రబాబు కూడా జగన్ సొంత గడ్డ అయిన పులివెందుల సీటు కైవసం చేసుకొని వైసీపీకి కోలుకోలేని షాక్ ఇవ్వాలని బాబు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు.
పులివెందులలో వైఎస్ జగన్ ను ఢీ కొట్టి నిలిచే గులుపు గుర్రాల కోసం చద్రబాబు జల్లెడ పడుతున్నారు.ఇక గన్నవరం గుడివాడ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది.
ఈ రెండు నియోజిక వర్గాల్లో వల్లభనేని వంశీ, కొడాలి నాని హవా బలంగా ఉంటుంది.

వీరిని దాటుకొని ఇతరులు గెలుపొందడం అంటే కాస్త కష్టమే.అందుకే వీరిద్దరు కూడా చంద్రబాబు, లోకేశ్ లకు సవాళ్ళు విసురుతున్నారు.దమ్ముంటే గుడివాడ లేదా గన్నవరం నుంచి పోటీ చేయాలని సవాళ్ళు విసురుతున్నారు.ఈ సవాళ్ళకు నారా లోకేశ్ కూడా గట్టిగానే జవాబిస్తున్నారు.” తాను టిడిపి బలం లేని చోట పోటీ చేసి ఓడిపోయానని, వైఎస్ జగన్ కూడా అదే విధంగా పులివెందుల దాటి పోటీ చేయాలని సవాల్ విసిరారు.ఇలా ఒకరి ఇలాఖలో మరొకరికి సవాళ్ళు విసురుతుండడంతో ఇలాంటి సవాళ్లను ఎవరెవరు స్వీకరిస్తారనేది హాట్ టాపిక్ గా మారింది.కాగా జగన్ పులివెందుల కాకుండా వేరే నియోజికవర్గంలో పోటీ చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో అనేది ప్రశ్నార్థకమే.
ఇక చంద్రబాబు కూడా కుప్పం కాకుండా వేరే ఇతర నియోజిక వర్గంలో పోటీ చేస్తే గెలవగలరా ? అనేది కూడా చెప్పలేని పరిస్థితి.మొత్తానికి సొంత ఇలాఖలో ఎవరు సరైనోళ్ళు అనేది ఇప్పుడు హాట్ హాట్ డిబేట్ల కు కారణం అవుతోంది.