బీర్ తాగితే కిడ్నీలలో రాళ్లు కరిగిపోతాయా.. అసలు నిజాన్ని బయటపెట్టిన వైద్యా నిపుణులు..!

కిడ్నీలలో రాళ్లు ఏర్పడే కేసులు దేశవ్యాప్తంగా రోజురోజుకీ పెరుగుతూ ఉన్నాయి.కిడ్నీ పనితీరు, కిడ్నీ రోగాల బారిన పడితే ఎదురయ్యే ఆరోగ్య సమస్యల గురించి చాలామందికి సరైన అవగాహన లేకపోవడం వల్లే ఈ కేసులు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూ వస్తున్నాయి.

 If You Drink Beer, Will The Stones In The Kidneys Dissolve Medical Experts Have-TeluguStop.com

ప్రపంచ కిడ్నీ దినోత్సవం మార్చి 9 వ తేదీన ప్రిస్టిన్ హెల్త్ కేర్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు బయటికి వచ్చాయి.బీరు తాగితే కిడ్నీలలో రాళ్లు కరిగిపోతాయని ప్రతి ముగ్గురిలో ఒకరు నమ్ముతున్నట్లు ఈ సర్వేలో తెలిసింది.

అయితే ఇందులో అసలు వాస్తవం లేదని కేవలం కల్పితమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.అలాగే కిడ్నీలలో రాళ్లు సమస్య చికిత్సకు 50 శాతం మంది కావాలనే 6 నెలలు ఆలస్యం చేస్తున్నట్లు కూడా తెలుసుకున్నారు.

కిడ్నీ రోగాలకు సంబంధించి అధికారికంగా జాతీయ గుణాంకాలు లేనప్పటికీ కేసుల్లో ఘనంగా పెరుగుదల కనిపిస్తున్నట్లు లైబ్రేట్ ఆన్‍లైన్ అపాయింట్‌మెంట్స్‌ డేటా స్పష్టం చేసింది.దీని ప్రకారం 2021తో పోల్చితే 2022లో కిడ్నీ రోగాలకు సంబంధించిన డాక్టర్ అపాయింట్‌మెంట్స్‌ ఏకంగా 108 శాతం పెరిగినట్లు సమాచారం.

వీరిలో ఎక్కువ మందికి కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నట్లు తెలుస్తోంది.ఈ సమస్యతో బాధపడుతున్న వారిలో మహిళలతో పోల్చితే పురుషులే మూడు రెట్లు అధికంగా ఉన్నారు.కిడ్నీలలో రాళ్ల సమస్య వల్ల ప్రధానంగా ఊబకాయం, హైపర్ టెన్షన్ వంటి సమస్యల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది.అయితే ఈ విషయం బాధితుల్లో 14 శాతం మందికే తెలుసు.

యూరిన్ కిడ్నీ నుంచి ఉత్పత్తి అవుతుందన్న విషయం సర్వేలో పాల్గొన్న 50 శాతం మందికి అసలు తెలియదు.కిడ్నీలు కూడా ప్రోటీన్ లను విచ్ఛిన్నం చేస్తాయని తొమ్మిది శాతం మందికి మాత్రమే తెలుసు.

ఎముకల ఆరోగ్యానికి కిడ్నీలే కీలకమనికే 9 శాతం మందికి తెలుసు.బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయని చెప్పడం అవాస్తమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube