అఖిల్ 'ఏజెంట్'పై మాసివ్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత!

అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.ఈయన అక్కినేని యువతరం హీరోల్లో ఒకరు.

 Akhil Akkineni And Surender Reddy Agent Update Details, Akhil Akkineni, Agent Mo-TeluguStop.com

కెరీర్ స్టార్ట్ చేసి చాలా ఏళ్ళు అవుతున్న ఇంకా బ్లాక్ బస్టర్ హిట్ అయితే అందుకోలేక పోయారు.బ్యాచిలర్ సినిమాతో మంచి హిట్ అయితే తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇక ఈ సినిమా తర్వాత నెక్స్ట్ సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ప్రకటించాడు.

అయితే ఈ సినిమా ప్రకటన వచ్చి కూడా రెండేళ్లు అవుతుంది.

అయినా ఇంకా ఈ సినిమా రిలీజ్ కాలేదు.కారోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇంకా ముగియనే లేదు.

అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ”ఏజెంట్”. యాక్షన్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అఖిల్ మునుపెన్నడూ లేని విధంగా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు.

Telugu Akhil, Akhil Akkineni, Sakshi Vaidya, Mammootty, Anil Sunkara, Surender R

ఈ సినిమా కోసం భారీగా కండలు పెంచేసి లుక్ మొత్తం మార్చేసి బీస్ట్ మోడ్ లోకి వచ్చాడు.ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ బాగానే ఆకట్టు కుంటుంది.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి నిర్మాత అనిల్ సుంకర మాసివ్ అప్డేట్ ఇచ్చారు.ప్రెజెంట్ అఖిల్ సీసీఎల్ తో బిజీగా ఉన్నాడు.దీంతో ఈ సినిమా షూట్ జరుగుతుందా లేదా అనే డౌట్ అందరిలో ఉంది.

Telugu Akhil, Akhil Akkineni, Sakshi Vaidya, Mammootty, Anil Sunkara, Surender R

దీనిపై నిర్మాత క్లారిటీ ఇస్తూ.ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ మస్కట్ లో శరవేగంగా జరుగుతుంది అని అయితే శనివారం అఖిల్ బెంగుళూరుకి మ్యాచ్ కోసం రానున్నారని తెలిపారు.ఇలా షూటింగ్ ఏమాత్రం ఆగలేదని నిర్మాత చెప్పడంతో ఈ సినిమా అనుకున్న సమయానికి వస్తుంది అని కన్ఫర్మ్ అయ్యింది.

ఇక ఏజెంట్ సినిమాను సురేందర్ 2 సినిమాస్ తో కలిసి ఏకే ఎంటెర్టాన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఎంతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

అలాగే ఈ సినిమాలో అఖిల్ రా ఏజెంట్ గా కనిపించ నుండగా.

ఈయనకు జోడీగా సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే కీలక పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్నాడు.

అలాగే హిప్ హప్ తమిజా సంగీతాన్ని అందిస్తుండగా రసూల్ ఫొటోగ్రఫీ అందిస్తున్నారు.ఏప్రిల్ 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube