కుటుంబంతో సూర్య విడిపోయారా.. ఆమె వల్ల ఫ్యామిలీలో గొడవలంటూ?

కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో సూర్య ఒకరు.సూర్య నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ సాధిస్తూ సూర్య మార్కెట్ ను అంతకంతకూ పెంచుతుండటం గమనార్హం.

 Reasons Behind Differences Between Surya And His Family Details Here Goes Viral-TeluguStop.com

సూర్య కుటుంబంతో విడిపోయారని తల్లీదండ్రులు, సోదరునితో సూర్యకు సత్సంబంధాలు లేవని జ్యోతిక అందుకు కారణమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

సూర్య ప్రస్తుతం ముంబైలో సెటిల్ అయ్యారని అందుకు కారణం ఇదేనని తెలుస్తోంది.విభిన్నమైన కథలను ఎంచుకుంటున్న సూర్యను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.2డీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య సినిమాలను నిర్మిస్తుండగా ఆ సినిమాలు సక్సెస్ సాధిస్తున్నాయి.ప్రస్తుతం సూర్య శివ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తుండటం గమనార్హం.వీర్ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

సూర్య 42వ సినిమాగా ఈ మూవీ తెరకెక్కుతుండగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఈ సినిమా తర్వాత వేట్రిమారన్ డైరెక్షన్ లో సూర్య నటించనున్నారు.2006 సంవత్సరంలో సూర్య జ్యోతికల వివాహం జరిగింది.ఈ జంటకు దియా, దేవ్ పేర్లతో ఇద్దరు పిల్లలు ఉన్నారు.

అయితే జ్యోతిక వల్ల తండ్రి, సోదరునితో సూర్యకు విభేదాలు వచ్చాయని బోగట్టా.తమిళ నటుడు బైల్వాన్ రంగనాథన్ ఈ విషయాలను వెల్లడించారు.

సూర్యకు ఆయన తండ్రికి సరిగ్గా సంబంధాలు లేవని పెళ్లి తర్వాత జ్యోతిక సినిమాల్లో నటించకూడదని శివకుమార్ కోరారని ఆమె మాత్రం సినిమాల్లో నటిస్తుండటంతో తండ్రి, కొడుకుల మధ్య గొడవలు వస్తున్నాయని ఆయన తెలిపారు.సూర్య తన ఫ్యామిలీ నుంచి వేరుపడాలని భావిస్తున్నారని బైల్వాన్ రంగనాథన్ పేర్కొన్నారు.వైరల్ అవుతున్న వార్తల గురించి సూర్య ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.సూర్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube