నంద్యాలలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణనీ పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.విషయంలోకి వెళ్తే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాలకు రామకృష్ణ రావటం జరిగింది.
ఈ క్రమంలో పేదలకు.ఇళ్ళు, టిడ్కో గృహాలను కేటాయించాలంటూ గురువారం “చలో విజయవాడ” కార్యక్రమాన్నికీ సీపీఐ పిలుపునివ్వడం జరిగింది.
దీంతో ముందస్తుగా రామకృష్ణ తో పాటు తొమ్మిది మంది సీపీఐ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.ఉపాధ్యాయ పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సమావేశాన్ని నగరంలో రామకృష్ణ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు.
ఈ క్రమంలో సమావేశ అనంతరం బయటకు వస్తున్న రామకృష్ణను మిగతా పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి నంద్యాల టూ టౌన్ స్టేషన్ కు తరలించారు.ఈ క్రమంలో పార్టీ శ్రేణులకు మరియు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.ఈ పరిణామంతో సీపీఐ రామకృష్ణ అరెస్టు పట్ల కార్యకర్తలు ఆందోళనకు దిగారు.ఈ రీతిగా అక్రమ అరెస్టు చేయటం దారుణమని పోలీసుల వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేశారు.
ఇదే సమయంలో… నంద్యాల సిపిఎం జిల్లా అధ్యక్షుడు టి.రమేష్ సైతం రామకృష్ణ అరెస్టును తీవ్రంగా ఖండించారు.ప్రజల తరఫున పోరాడుతుంటే అరెస్టు చేయటం సిగ్గుచేటు.వెంటనే రామకృష్ణని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.