హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా మొదట పూజా హెగ్డే పేరు వినిపించిందనే సంగతి తెలిసిందే.ఈ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్ గా ప్రకటించే సమయానికి ఆమె వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు.
అయితే తర్వాత రోజుల్లో పూజా హెగ్డే నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచాయనే సంగతి తెలిసిందే.
ప్రస్తుతం తెలుగులో పూజా హెగ్డేకు క్రేజ్ తగ్గింది.
పూజా హెగ్డే యాక్టింగ్ స్కిల్స్ పై కూడా చాలామంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారనే సంగతి తెలిసిందే.అయితే పూజా హెగ్డేకు దిమ్మతిరిగే షాకిస్తూ శ్రీలీల మరో ఆఫర్ ను అందుకుంది.
హరీష్ శంకర్ భవదీయుడు భగత్ సింగ్ టైటిల్ ను ఉస్తాద్ భగత్ సింగ్ గా మార్చారనే సంగతి తెలిసిందే.ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా ఫైనల్ అయినట్టు సమాచారం అందుతోంది.
పూజా హెగ్డే తనకు బదులుగా శ్రీలీల ఎంపికైన నేపథ్యంలో ఆమె ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.వినోదాయ సిత్తం రీమేక్ లో శ్రీలీల స్పెషల్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.పవన్ కు జోడీగా శ్రీలీల అనే విషయం తెలిసి ఫ్యాన్స్ సైతం ఎంతగానో సంతోషిస్తున్నారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీలీల క్రేజీ హీరోయిన్ గా నిలిచారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
వరుసగా టాలీవుడ్ స్టార్ హీరోలకు జోడీగా అవకశాలను అందుకుంటూ శ్రీలీల వార్తల్లో నిలుస్తున్నారు.శ్రీలీల డ్యాన్స్ లు కూడా అద్భుతంగా చేస్తుండటంతో ఆమెకు మూవీ ఆఫర్లు పెరుగుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.శ్రీలీల పారితోషికం అంతకంతకూ పెరుగుతోంది.శ్రీలీల రాబోయే రోజుల్లో నంబర్ వన్ హీరోయిన్ గా నిలిచే ఛాన్స్ అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.