తారకరత్న కన్ను మూసిన రోజు నుంచి ఏదో ఒక వార్త బయటకు వస్తూ సంచలనం సృష్టిస్తోంది.ఆయన పోయిన విషయం ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మర్చిపోలేదు.
నందమూరి కుటుంబం ఇంకా పూర్తి శోభసంద్రంలోనే మునిగి ఉంది.అయితే తారక రత్న కనుక ఇప్పుడు బ్రతకుండి ఉంటే కొన్ని పాన్ ఇండియా సినిమాల్లో నటించేవాడు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ సినిమాలు ఏంటి? ఆ వివరాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
తారక రత్న దాదాపు 20 ఏళ్ల క్రితమే కెరియర్ ప్రారంభించి 20 సినిమాల వరకు నటించిన మొదటి సినిమా మినహా అన్ని పరాజయం పాలయ్యాయి.కానీ హీరోగా కాకుండా విలన్ గా అవతారం ఎత్తి నటించిన తారకరత్నకి కెరియర్ ఊపందుకుంది.
ఇక అమరావతి సినిమాలో నటించేందుకు కాను విలన్ గా నంది అవార్డు సైతం అందుకున్నాడు.ఈ క్రమంలో ఇటీవలే ఆయనకు కెరీర్ పరంగా మంచి రోజులు మొదలయ్యాయి.
అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న బాలకృష్ణ సినిమాలో ఒక మంచి పాత్రకు తారక రత్న ను ఎంచుకున్నారట.ఇది మాత్రమే కాదు ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే చిత్రంలో కూడా ఒక ముఖ్యమైన రోల్ కి బాలకృష్ణ రిఫర్ చేయడం తో అశ్వినీదత్ మాట ఇచ్చారట.
దాదాపు నాలుగు వందల కోట్ల తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తారక రత్న కు అవకాశం వస్తె అతడి భవిష్యత్తు చాలా బాగా బాగుండేది.కానీ ఈ లోగా ఆయన కన్ను మూయడం తో ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి.సినిమాలు మాత్రమే కాకుండా రాజకీయాల్లోనూ బిజీ అవ్వాలని తారక రత్న అనుకున్నాడు.అందుకోసమే ఎమ్మేల్యే సీట్ కూడా బాలయ్య చంద్ర బాబు తో మాట్లాడి పెట్టాడట.ఇలా తాను అనుకున్న ప్రకారం అన్ని జరిగితే తారక రత్న కెరీర్ చాలా బాగుండేది.కానీ ఈ లోగానే ఈ విధంగా జరగడం అందరినీ బాధ కు గురి చేసింది.