ప్రస్తుతం షాపింగ్ అనేది పూర్తిగా ఆన్‌లైన్ మయం అయిపోయింది అని చెప్పుకోవచ్చు.కాలు కడపకుండానే మనకు ఇష్టమైన వస్తువులు మన డోర్ దగ్గరకి వచ్చి పడుతుంటే ఎవరు మాత్రం పనిగట్టుకొని షాపుల దగ్గరకు వెళతారు.
అవును, నేడు కొరియర్‌ల ద్వారానే తమకు కావాల్సిన వస్తువులను ఆర్డర్ ద్వారా తీసుకుంటున్నారు.ఇకపోతే మీరు మీ ఇంటికి కొరియర్ చేసిన పార్శిల్‌ను జాగ్రత్తగా పరిశీలిస్తే, అది దాదాపుగా బ్రౌన్ కలర్ బాక్స్‌లోనే వస్తుంది.అలా కొరియర్‌లలో వచ్చే పెట్టెలు ఎప్పుడూ బ్రౌన్ కలర్‌లో ఉండటాన్ని చూసి ఎలాంటి సందేహం కలగలేదా?
ఇక ఈ పెట్టెలు బ్రౌన్ కలర్‌లోనే ఎందుకు తయారు చేస్తారు అంటే, దాని వెనుక ఉన్న ఒక ముఖ్యమైన కారణం వుంది.వాస్తవానికి, కొరియర్‌ల పెట్టెలు కార్పోర్ట్‌తో తయారు చేయబడతాయి.కార్పోర్ట్ అనేది పూర్తిగా కాగితంతో తయారు చేయబడుతుందనే విషయం మీకు తెలుసు కదా.సహజమైన కాగితాలు అనేవి బ్లీచ్ చేయబడవు.అందుకే గోధుమ రంగులో ఉన్నవాటిని ఎంచుకుంటారు.సహజమైన కాగితాన్ని బ్లీచింగ్ చేయడం ద్వారా తెల్లగా మారుస్తాము.తద్వారా దానిపై సులభంగా వ్రాయవచ్చు.
అయితే, మనం కార్పొరేట్‌పై ఏమీ రాయనవసరం లేదు, కాబట్టి దానిని వైట్‌వాష్ చేయడానికి డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.వస్తువుల ఆన్‌లైన్ బుకింగ్ డెలివరీ కోసం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీసో వంటి అనేక రకాల ఈకామర్స్ కంపెనీలు ఉపయోగించే బాక్స్‌లు వాస్తవానికి కార్పోర్ట్ బాక్స్‌లు.ఎందుకంటే కొరియర్‌ల కోసం ఉపయోగించే కార్పోర్ట్ బాక్స్‌కు కస్టమర్ అనేవాడి అదనంగా డబ్బులు చెల్లించరు.
అందుకనే ఇలాంటి కాగితంతో తయారు చేసిన పేపర్లనే విరివిగా పార్సిళ్లలో వాడుతూ వుంటారు.ఈ విషయం మీ స్నేహితులతో కూడా పంచుకోండి.