సినిమా ఇండస్ట్రీలో చాలాకాలం పాటు హీరోలు హీరోయిన్లు నటిస్తూ ఇండస్ట్రీలో చలామణి అయిన ఆర్టిస్ట్ లు చాలామంది ఉంటారు.అయితే ఇండస్ట్రీలో ఆర్టిస్టుల నటన కి ఫిదా అయిపోయిన అభిమానులు ఏదో ఒక రకంగా వాళ్ల మీద అభిమానాన్ని తెలియజేస్తూ ఉంటారు అలాగే సినిమాలో నటించిన చాలామంది ఆర్టిస్టుల కి వాళ్ల ఫ్యాన్స్ గుళ్ళు కట్టి వాళ్ల అభిమానాన్ని చాటుకున్నారు గుడి కట్టే అంత అభిమానాన్ని సంపాదించుకున్న ఆర్టిస్టులు ఎవరో ఇప్పుడు చూద్దాం… గుడి కట్టి వాటిని కూల్చివేసిన అభిమానులు కూడా ఉన్నారు.
ఖుష్బూ
వెంకటేష్ హీరోగా పరిచయమవుతూ రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన కలియుగ పాండవులు సినిమా లో హీరోయిన్ గా కుష్బూ తెలుగు తెరకి పరిచయం అయింది తర్వాత ఆమె చాలా సినిమా లో హీరోయిన్ గా నటించింది.తెలుగుతోపాటు తమిళ సినిమాలు కూడా ఎక్కువగా చేసేది ఆమె నటనకి ఫిదా అయిపోయిన తమిళ జనాలు ఆవిడకి తమిళనాడులోని మధురైలో గుడి కట్టారు.
అయితే ఆమె ఒక కార్యక్రమంలో అసభ్యంగా మాట్లాడినందుకు గుడికట్టిన అభిమానులే ఆ గుడి నీ కూల్చేశారు.అయితే కుష్బూ చివరగా తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన అజ్ఞాతవాసి సినిమా లో పవన్ కళ్యాణ్ అమ్మ గా నటించింది.
సోనుసూద్
సోనుసూద్ సినిమాలలో విలన్ గా నటిస్తూ ఉంటాడు దాదాపు తను చేసిన సినిమాలన్నింటిలో నెగిటివ్ పాత్రలే ఎక్కువగా చేసాడు.సోనుసూద్ తెలుగులో చాలా సినిమాలు చేసినప్పటికీ కోడి రామకృష్ణ దర్శకత్వంలో అనుష్క మెయిన్ రోల్ చేసిన అరుంధతి సినిమాలో విలన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన జులాయి సినిమా లో ఒక మంచి విలన్ పాత్ర పోషించి తనదైన యాక్టింగ్ తో జనాలని మెప్పించాడు.కరోనా వల్ల దేశం మొత్తం లాక్ డౌన్ విధించడంతోఎక్కడ జనాలు అక్కడ నిలిచిపోయారు దీంతో తినడానికి తిండి లేక చాలా మంది చనిపోయారు ఇదంతా చూసిన సోనుసూద్ వాళ్ల కోసం ఏదో ఒకటి చేయాలని తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వలస కూలీలను వాళ్ల వల్ల రాష్ట్రాలకు చేర్చాడు వాళ్ల రాష్ట్రంలో కాకుండ వివిధ ప్రదేశాలలో ఉన్న మనుషులను వాళ్ల సొంత ప్రదేశాలకి పంపించాడు వేరే దేశంలో చిక్కుకున్న వాళ్లని మన దేశానికి రప్పించాడు.దాంతో దేశవ్యాప్తంగా హీరో అయిపోయాడు ఇవన్నీ చూసిన ఆయన నుంచి సహాయం పొందిన వారిలో సిద్ధిపేట లోని ఒక తండా దగ్గర నివసించే జనాలు అతనికి గుడి కట్టారు ఆ విగ్రహానికి రోజు పూజలు చేస్తూ ఉంటారు.
నమిత
తెలుగులో సొంతం సినిమాతో పరిచయమైన నమిత తర్వాత తెలుగులో చాలా సినిమాలు చేశారు అయితే తెలుగుతో పాటు తమిళంలో కూడా ఆమె చాలా సినిమాలు చూశారు.తన నటనను నచ్చిన తమిళనాడు ప్రజలు ఆమెకు గుడి కట్టారు అయితే నమిత బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన సింహా సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేశారు.
పూరి జగన్నాథ్
తెలుగు ఇండస్ట్రీలో దాదాపు అందరు హీరోలతో వర్క్ చేసిన ఈ జనరేషన్ దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది పూరి జగన్నాథ్ ఒక్కడే.ఆయన ఏ హీరోతో సినిమా చేస్తే ఆ హీరోకి ఒక డిఫరెంట్ స్టైల్ క్రియేట్ చేస్తారు.బద్రి తో పవన్ కళ్యాణ్ గారికి, ఇడియట్ తో రవితేజకి , పోకిరి తో మహేష్ బాబుకి, దేశముదురు తో అల్లు అర్జున్ కి, చిరుతతో రామ్ చరణ్ కి, బుజ్జిగాడు తో ప్రభాస్ కి ఇలా ప్రతి హీరో తో డిఫరెంట్ మేనరిజంతో కూడిన యాక్టింగ్ ని చూపించారు.అయితే పూరి జగన్నాథ్ కి కూడా కరీంనగర్ కి చెందిన ఒక కుర్రాడు అతని మీద ఉన్న అభిమానంతో అతనికి కూడా ఒక గుడి కట్టారు.
హీరో హీరోయిన్లకు మాత్రమే గుడి కట్టడం మనం చూస్తూ ఉంటాం కానీ ఫస్ట్ టైం డైరెక్టర్ కి కూడా గుడి కట్టడం చూస్తున్నాం.కానీ డ్రగ్స్ కేసులో పూరి పేరు బయటకు రావడంతో అభిమాని ఒకరు హర్ట్ ఆ విగ్రహాన్ని కూల్చేశారు.