ప్రభాస్, మారుతి సినిమా.. అది లేదంటూ మండిపడుతున్న డార్లింగ్ ఫ్యాన్స్?

టాలీవుడ్ స్టార్ హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నప్పటికీ అభిమానులకు మాత్రం నిరాశ తప్పడం లేదు.

 Prabhas Fans Fire On Maruthi Movie They Trolling For Announcement , Prabhas, Mar-TeluguStop.com

వరుసగా సినిమా షూటింగ్లో పాల్గొంటున్న ప్రభాస్ తన సినిమాలకు సంబంధించి ఎటువంటి అప్డేట్ ని ఇవ్వకపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాగా ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కూడా ఒకటి.

ఈ సినిమా చేస్తున్నట్లు ఒక ప్రెస్ మీట్ లో వెల్లడించినప్పటికీ ఈ సినిమా ఎప్పుడు మొదలు కానుంది ఎలా ఉండబోతుంది అన్న విషయం మాత్రం ప్రకటించలేదు.

కానీ ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఎప్పుడో మొదలు పెట్టినట్టు తెలుస్తోంది.

అందుకు సంబంధించిన విషయాలు బయటకు లీక్ కాకుండా ఇప్పటికే మూడో షెడ్యూల్ ని కూడా ప్రారంభించినట్టు తెలుస్తోంది.ఇప్పటికే సినిమాకు సంబంధించిన షూటింగ్ సగానికి సగం పూర్తయినట్లు తెలుస్తోంది.

సినిమా షూటింగ్ పూర్తి అయినా కూడా ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన ఎటువంటి అప్డేట్ విడుదల కాకపోవడంతో అభిమానులు మండిపడుతున్నారు.ప్రభాస్ అభిమానులు డైరెక్టర్ ప్రభాస్ పై అలాగే డార్లింగ్ పై మండిపడుతున్నారు.

ఈ క్రమంలోనే ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికైనా ఏదైనా అప్డేట్ ప్రకటించాలని వాళ్లు డిమాండ్‌ చేస్తున్నారు.

Telugu Fans, Maruthi, Nidhi Agarwal, Prabhas, Raja Deluxe, Tollywood-Movie

#AnnouncePrabhasMaruthiFilm అనే యాష్‌ ట్యాగ్‌ని ట్రోల్‌ చేస్తున్నారు.అటు మారుతిని, నిర్మాణ సంస్థని ట్రోల్‌ చేస్తున్నారు.మా అభిమాన హీరోని చూపించరా అంటూ గగ్గోలు పెడుతున్నారు.అయితే ఈ సినిమాలోని ఫస్ట్ లుక్‌ ఇచ్చేందుకు టీమ్‌రెడీ అయ్యిందట.ఇక సోషల్ మీడియాలో అభిమానులు రచ్చ రచ్చ చేయడంతో ప్రభాస్ మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు సంబంధించి ఏదో ఒక అప్డేట్ ని విడుదల చేయాలని చిత్ర బృందం భావించినట్టు తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే ప్రభాస్ కి సంబంధించిన విడుదల చేయడానికి ఒక రోజు అంతా ఫోటో షూట్ చేసినట్టు కూడా తెలుస్తోంది.

మారుతి సినిమాలోని ఆయన పాత్ర లుక్‌ రిఫ్లెక్ట్ అయ్యేలాగా ఈ ఫోటో షూట్‌ చేసినట్టు సమాచారం.

Telugu Fans, Maruthi, Nidhi Agarwal, Prabhas, Raja Deluxe, Tollywood-Movie

అంతేకాదు త్వరలోనే ఫస్ట్ లుక్‌ని విడుదల చేయాలని భావిస్తున్నారట.ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.రాజా డీలక్స్ అనే పేరుని టైటిల్ గా పెట్టాలని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

పాన్‌ ఇండియా సినిమాల బడ్జెట్‌లో కాకుండా చాలా లిమిటెడ్‌ బడ్జెట్‌లో ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని, ఫన్‌, కమర్షియల్‌, యాక్షన్‌ ఎలిమెంట్ల మేళవింపుతో ఉంటుందని, పాత ప్రభాస్‌ని చూస్తారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube