టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది రకుల్ ప్రీత్ సింగ్.
ఇకపోతే రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.కాగా రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడు జాకీ భగ్నానీ ని 2021 లో పరిచయం చేసిన విషయం తెలిసిందే.
సోషల్ మీడియా వేదికగా తన లవ్ విషయాన్ని బయటపెట్టింది రకుల్ ప్రీత్ సింగ్.అయితే ఏ ముహూర్తాన రకుల్ ప్రీత్ సింగ్ తన లవ్ విషయాన్ని బయటపెట్టిందో గానీ అప్పటినుంచి అభిమానులు పెళ్లెప్పుడు పెళ్లెప్పుడు అంటూ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.
ఆమె ఎక్కడికి వెళ్ళినా కూడా ఆమె పెళ్లికి సంబంధించిన వార్తలు ఎదురవుతున్నాయి.ఎక్కడికి వెళ్ళినా కూడా ఆమె పెళ్లికి సంబంధించిన ప్రశ్నలను అడుగుతూ కొన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు.ఆ ప్రశ్నల పై రకుల్ ప్రీత్ సింగ్ పలు సార్లు అసహనం కూడా ప్రదర్శించింది.తాజాగా ఇదే విషయంపై మరోసారి మండిపడింది రకుల్ ప్రీత్ సింగ్.సోషల్ మీడియాలో కథనాల ప్రకారం నాకు గత ఏడాది నవంబర్ లోనే పెళ్లయిపోయింది.ఇంతకీ నా పెళ్లి ఎలా జరిగిందో నాకు చెప్పనే లేదూ అంటూ సెటైర్స్ వేసింది.
నేను చాలా బిజీగా ఉన్నాను.ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదు అంటూ కాస్త గట్టిగా స్పందించింది రకుల్.
ఇకపోతే గత ఏడాది రకుల్ తమ్ముడు అమన్ వచ్చే ఏడాది మా అక్క వివాహం ఉండొచ్చు అని సోషల్ మీడియాలో హింట్ ఇవ్వడంతో అప్పటి నుంచి రకుల్ ప్రీత్ సింగ్ వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.అయితే మొన్నటి వరకు సినిమాల పరంగా వరుస ఫ్లాప్ ని ఎదుర్కొన్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే మంచి హిట్ టాక్ను సొంతం చేసుకుంది.రకుల్ తాజాగా నటించిన సినిమా ఛత్రీవాలి.ఈ సినిమా జీ5 లో నేరుగా విడుదలైన విషయం తెలిసిందే.బోల్డ్ సబ్జెక్టు తో తెరకెక్కిన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ దక్కింది.వరుస ఫ్లాప్స్ తర్వాత దక్కిన హిట్ కావడంతో రకుల్ సంతోషం వ్యక్తం చేసింది.
సెక్స్ ఎడ్యుకేషన్ నేపథ్యంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఛత్రీవాలి తెరకెక్కింది.రకుల్ ప్రీత్ కండోమ్ టెస్టర్ రోల్ చేశారు.
ప్రయోగాత్మక చిత్రంలో రకుల్ ప్రీత్ నటనతో ఆకట్టుకున్నారన్న మాట వినిపిస్తోంది.