తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడింది.అంతకంటే ముందుగా బీఆర్ఎస్ అధినేత , తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని, అందుకే ఈ మధ్యకాలంలో స్పీడ్ పెంచారని ప్రచారం జరుగుతోంది.
ముందస్తు ఎన్నికలైన , సాధారణ ఎన్నికలైన ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ సిద్ధంగానే ఉంది.ఇప్పటికే సిట్టింగ్ లు అందరికీ టిక్కెట్లు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు.
కెసిఆర్ ఈ ప్రకటన చేసినా, సిట్టింగ్ ఎమ్మెల్యేలు , మంత్రులు మాత్రం ఈ విషయంలో టెన్షన్ పడుతున్నారు.ఎలాగు తమకే టికెట్ రావడం గ్యారెంటీ అయినా ఎన్నికల్లో గెలిచే పరిస్థితి ఉందా లేదా ? తమపై ఏ స్థాయిలో వ్యతిరేకత ఉంది అనే విషయాలపై సొంతంగా సర్వేలకు దిగుతున్నారట.ఈ మేరకు కొన్ని ప్రైవేటు సర్వే సంస్థలకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది ? జనాల్లో తమపై ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయి ? ఏ విషయాల్లో వ్యతిరేకత ఉంది అనే విషయాలపై సర్వేల ద్వారా ఆరా తీస్తున్నారట.

ఇప్పటికే కొన్ని సర్వే సంస్థలు ప్రజలకి నేరుగా ఫోన్ చేసి ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది ? ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏమిటి ? సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా ? ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలపై మీకున్న అభిప్రాయం ఏమిటి ? బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఏ స్థాయిలో అభివృద్ధి చెందింది.ఇంకా ప్రధానంగా ఉన్న సమస్యలు ఏమిటి ? మీ ఎమ్మెల్యే నుంచి ప్రభుత్వం నుంచి ఇంకా ఏమేమి కోరుకుంటున్నారు అనే విషయాలపై ఆరా తీస్తున్నారట.ఈ ఫీడ్ బ్యాక్ ద్వారా ప్రధానంగా నియోజకవర్గ ప్రజల్లో తమపై ఏ రకమైన అభిప్రాయాలు ఉన్నాయి ? ఏ ఏ సమస్యలను పరిష్కరిస్తే తమకు తిరుగులేకుండా ఉంటుంది అనే విషయాలపై దృష్టి పెట్టేందుకు ఈ సర్వే రిపోర్ట్ లను ఉపయోగించుకోబోతున్నారట.

ఎలాగూ బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల పరిస్థితులపై సర్వేలు చేయిస్తారని, అంతకంటే ముందుగానే తాము వ్యక్తిగతంగా సర్వే చేయించుకుని ఎన్నికల సమయం నాటికి ప్రజల్లో వ్యతిరేకత లేకుండా చేసుకుంటే తమకు తిరిగి ఉండదనే ఆలోచనలో ఉన్నారట.ముఖ్యంగా మంత్రులపై వ్యతిరేకత కాస్త ఎక్కువగా ఉందనే సంకేతాలు రావడంతో వారు కూడా అలెర్ట్ అవుతున్నారు.ఇప్పటికే బీఆర్ఎస్ రెండుసార్లు అధికారంలోకి వచ్చింది.
మూడోసారి అధికారం కోసం ప్రయత్నాలు చేస్తుంది.వరుసగా గెలుస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలపైనా జనాలకు మొహం మొత్తుతుంది.
మార్పు వస్తే మంచిదని భావిస్తూ ఉంటారు.కానీ ఆ అభిప్రాయాలు జనాల్లో రాకుండా మళ్ళీ గెలిపించుకునే విధంగా ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ విధంగా తండాలు పడుతున్నారట.