జోగికి క్లాస్.. వసంత కు బుజ్జగింపులు ! జగన్ ముందుచూపు ? 

మైలవరం వైసిపి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గత కొంతకాలంగా వైసీపీ ప్రభుత్వం పైన పార్టీ పైన తన అసంతృప్తిని వెలగకుతూ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే దీంతో ఆయన వైసీపీని వేడుతారని ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది ఈ వ్యాఖ్యలను వసంత కృష్ణ ప్రసాద్ ఖండించారు.తాను పార్టీలో మారే వ్యక్తిని కాదని వైసీపీలోనే ఉంటానంటూ క్లారిటీ ఇచ్చారు.

 Class For Jogi Appeasement For Vasantha! Jagan Preview, Jogi Ramesh, Vasantha Kr-TeluguStop.com

అయితే రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన కూడా లేదు అన్నట్లుగా వసంత కృష్ణ ప్రసాద్ అప్పట్లో వ్యాఖ్యానించారు.అయితే ఆయన అసంతృప్తికి గురవడానికి కారణం ప్రస్తుత ఏపీ మంత్రి జోగి రమేష్ .వసంత కృష్ణ ప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న మైలవరం నియోజకవర్గంలో జోగి రమేష్ వేలు పెడుతుండడం,  కృష్ణ ప్రసాద్ కు ఇబ్బందికరంగా మరిందట.అయితే ఈ వ్యవహారంలో వైసీపీ అధిష్టానం జోగి రమేష్ కే మద్దతుగా నిలబడి కృష్ణ ప్రసాదను పట్టించుకోనట్టుగా వ్యవహరించింది.

అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు ఎగరవేయడం,  వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి,  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ పైన,  ప్రభుత్వం పైన విమర్శలు చేయడం టిడిపిలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుండడం ఇదే బాటలో మరి కొంతమంది వైసిపి ఎమ్మెల్యేలు వెళ్లే ఆలోచనతో ఉండడంతో జగన్ అలర్ట్ అయ్యారు.

Telugu Ap Cm Jagan, Ap, Jogi Ramesh, Vasanthakrishna, Ysrcp-Politics

ఈ మేరకు అసంతృప్తికి గురవుతున్న పార్టీ నేతలకు బుజ్జగింపులు మొదలుపెట్టారు.తాజాగా జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో జోగి రమేష్ పై జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.మైలవరం నియోజకవర్గంలో ఎందుకు వేలు పెడుతున్నారని జోగి రమేష్ పై జగన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు మీడియాలోనూ కథనాలు వచ్చాయి.

ఆ తర్వాత రోజు వసంత కృష్ణ ప్రసాద్ కు జగన్ నుంచి పిలుపు వచ్చింది.ఈ సందర్భంగా ఆయన అసంతృప్తి గల కారణాలను జగన్ అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ పై వసంత కృష్ణ ప్రసాద్ ఫిర్యాదు చేయడంతో , ఇక ఎటువంటి ఇబ్బందులు ఉండవని, ఇకపై అన్ని తాను చూసుకుంటానని , ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా నేరుగా తనతో చెబితే పరిష్కరిస్తానని జగన్ వసంత కృష్ణ ప్రసాద్ ను బుద్ధిగించారట.తనకు అత్యంత సన్నిహితుడుగా ముద్ర పడిన మంత్రి జోగి రమేష్ కు గట్టిగా క్లాస్ పీకడం తో వసంత కృష్ణ ప్రసాద్ విషయంలో జగన్ చాలా ముందు చూపుతోనే వ్యవహరించినట్టు అర్థమవుతుంది.

 పార్టీ నేతలు అంతా తమ అసంతృప్తిని బయటకు వెళ్ళగక్కుతూ వస్తే రాబోయే ఎన్నికల్లో తమకు అవి ఇబ్బందికరంగా మారుతాయని,  పార్టీలోనూ ఏదో అలజడి జరుగుతుందనే సంకేతాలు జనాల్లోకి వెళుతుందనే కారణంతో జగన్ ఈ విధంగా బుజ్జగింపులు మొదలుపెట్టినట్లుగా పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube