వైరల్: ఇదెక్కడి వెడ్డింగ్ షూట్... ఫోజులివ్వండ్రా అంటే ముద్దుల్లో మునిగిపోయారు?

సోషల్ మీడియా వలన దేశంలోని ఎక్కడెక్కడో జరుగుతున్న విషయాలు ఇట్టే తెలిసిపోతున్నాయి.ఈ క్రమంలో కొన్ని వీడియోలు అయితే తెగ వైరల్ అవుతుంటాయి.

 Bangalore Couple Wedding Shoot Viral Social Media,photo Shoot,viral News,viral V-TeluguStop.com

ముఖ్యంగా వివాహ వేడుకలకు సంబంధించిన వీడియోలు అయితే నెటిజన్లను బాగా అలరిస్తూ ఉంటాయి.నేడు భారతీయ వివాహాలలో పెను మార్పులు వచ్చాయి అని చెప్పుకోవచ్చు.

నేటి జనాలు పాశ్చాత్య పోకడలకు పోతున్నారు.ఒకప్పుడు భార్యాభర్తలైనా బహిరంగంగా హద్దులు మీరు ప్రవర్తించేవారు కాదు.

కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.తాజాగా ఈ రకమైన తంతు ఒకటి వెలుగు చూసింది.

దాంతో నెటిజన్లకు మంచి ఎంటర్టైన్మెంట్ లభించింది.

వైరల్ అవుతున్న వీడియోని ఒకసారి గమనిస్తే, వధూవరులు కెమెరామెన్ చెప్పిన విధంగా ఫొటోలకు ఫోజులిస్తున్నారు.ఈ క్రమంలో వధువుకు ముద్దుపెట్టేలా ఓ ఫోజు ఇవ్వాలని ఫొటోగ్రాఫర్ వారికి సూచించాడు.ఇక ఫొటోగ్రాఫర్ అడిగిందే తడువుగా ఆ కొత్తజంట ముద్దుల్లో మునిగి తేలిపోయారు.

దాంతో ఫొటో గ్రాఫర్ కి సైతం దిమ్మతిరిగిపోయింది.ఆ చుట్టుపక్కనున్న వాళ్ళ సంగతి సరేసరి.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాగా బెంగుళూరు చెందిన పెళ్లి జంటగా తెలుస్తోంది.కానీ ఇక్కడ కెమెరామెన్ ను సైతం పట్టించుకోకుండా ఇద్దరు లిక్‌లాప్ ముద్దులో లీనమైపోవటం పలువురిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.ఇక నెటిజన్లకైతే ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ షో చూసిన ఫీలింగ్ కలుగుతోంది.

బాంగ్ టీనేజర్స్ అనే ఖాతానుంచి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దీనికి క్యాప్సన్ గా రిప్ కెమెరామెన్ అని రాసి ఉండడం కొసమెరుపు.

ఈ వీడియో షేర్ చేసిన కొద్ది గంటల్లోనే లక్షల్లో లైక్ చేశారు.కొందరు నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube