దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా ఎప్పటికప్పుడు సరికొత్త సేల్స్ తీసుకొస్తుంది.కాగా తాజాగా Amazon.in ప్రారంభించిన ప్రైమ్ ఫోన్స్ పార్టీ సేల్ అందర్నీ ఆకట్టుకుంటుంది.
కంపెనీ ఈ సేల్ కింద షియోమీ, శామ్‌సంగ్, ఐకూ, రియల్‌మీ, టెక్నో, ఒప్పో వంటి ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లపై ప్రత్యేక తగ్గింపులను అందిస్తోంది.సేల్ 2023, ఫిబ్రవరి 8 వరకు కొనసాగుతుంది.
షియోమీ :
షియోమీ 12 ప్రో, రెడ్‌మీ 11 ప్రైమ్ 5G, రెడ్‌మీ K50i, రెడ్‌మీ 10 పవర్‌పై బ్యాంక్ డిస్కౌంట్లు ఉన్నాయి.ఈ డిస్కౌంట్స్ వల్ల షియోమీ 12 ప్రో రూ.47,499కి తగ్గుతుంది.అలానే రెడ్‌మీ 11 ప్రైమ్ 5G రూ.12,634, రెడ్‌మీ K50i రూ.21,849, రెడ్‌మీ 10 పవర్ రూ.10,829కి లభిస్తాయి.
శామ్‌సంగ్ :
శామ్‌సంగ్ M సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లపై కూడా డిస్కౌంట్లు ఉన్నాయి.ఈ సేల్‌లో గెలాక్సీ M33 రూ.15,342, గెలాక్సీ M13 రూ.9,927, గెలాక్సీ M04 రూ.8,499కి వస్తున్నాయి.
ఐకూ :
Z6 లైట్, నియో 6, ఐకూ 11 5Gతో సహా తాజా ఐకూ స్మార్ట్‌ఫోన్‌లపై డీల్స్ ఉన్నాయి.ఐకూ Z6 లైట్ రూ.13,988, నియో 6 రూ.25,649, ఐకూ 11 5G రూ.54,999 ధరలకు లభిస్తున్నాయి.
రియల్‌మీ :
నార్జో 50, నార్జో 50 ప్రో, నార్జో 50i ప్రైమ్‌తో సహా రియల్‌మీ నార్జో సిరీస్‌పై అద్భుతమైన తగ్గింపులు ఉన్నాయి.నార్జో 50 ప్రో రూ.18,049, నార్జో 50i ప్రైమ్ రూ.7,199కి దిగి వచ్చాయి.
టెక్నో :
టెక్నో స్పార్క్ 9, పాప్ 6 ప్రోపై తగ్గింపులు ఉన్నాయి.దీనివల్ల వీటిని చాలా తక్కువ ధర తో సొంతం చేసుకోవచ్చు.
ఒప్పో:
ఒప్పో A78 5000mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ ఆఫర్ చేస్తుంది.ఇది బ్యాంక్ డిస్కౌంట్‌లతో రూ.17,100కే ధర తగ్గింది.ఒప్పో F21s ప్రో, F21s ప్రో 5G కూడా ఆఫర్‌లో దొరుకుతున్నాయి.