చిరంజీవి తర్వాత బెస్ట్ డ్యాన్సర్ ఆ హీరోనే.. కొరియోగ్రాఫర్ షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం సినిమాలలో నటిస్తున్న స్టార్ హీరోలలో నంబర్ వన్ డ్యాన్సర్ ఎవరనే ప్రశ్నకు చిరంజీవి పేరు సమాధానంగా వినిపిస్తుంది.వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవి డ్యాన్స్ లు అద్భుతంగా ఉన్నాయనే సంగతి తెలిసిందే.

 Suchitra  Comments About Best Dancer After Young Tiger Ntr Details Here Goes Vir-TeluguStop.com

చిరంజీవి తర్వాత బెస్ట్ డ్యాన్సర్ ఎవరని అడిగితే కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ పేరు సమాధానంగా చెబితే మరి కొందరు బన్నీ పేరు సమాధానంగా చెబుతారు.

అయితే ప్రముఖ కొరియోగ్రాఫర్ సుచిత్ర మాట్లాడుతూ స్టైల్ విషయంలో చిరంజీవి గారిని రీప్లేస్ చేసేది ఎవరనే ప్రశ్నకు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పగలనని సుచిత్ర అన్నారు.

ఎలాంటి డ్యాన్స్ మూమెంట్ చేయాలన్నా తారక్ చేయగలడని సుచిత్ర కామెంట్లు చేశారు.బన్నీ యూనిక్ గా డ్యాన్స్ చేస్తారని అయితే ఒకరిని ఇంకొకరితో పోల్చకూడదని ఆమె తెలిపారు.

ఎన్టీఆర్, బన్నీ, చరణ్ ఎవరికి వాళ్లు ఓన్ యూనిక్ నెస్ ను కలిగి ఉన్నారని సుచిత్ర అన్నారు.

Telugu Chiranjeevi, Jr Ntr, Ram Charan, Sr Ntr, Tollywood-Movie

ఇచ్చిన కంపోజింగ్ ను సులువుగా గ్రాస్ప్ చేసుకునే ప్రతిభ అందరు హీరోలలో ఉందని ఆమె కామెంట్లు చేశారు.తనను తాను బిల్డ్ చేసుకునే విషయంలో అల్లు అర్జున్ గ్రేట్ అని సుచిత్ర అన్నారు.నితిన్ కూడా బాగా డ్యాన్స్ చేస్తున్నారని ఆమె తెలిపారు.

కొన్ని సినిమాలలో స్క్రిప్ట్ బాలేదని కొన్ని సినిమాలకు స్క్రిప్ట్ బాగున్నా సాంగ్స్ బాగుండటం లేదని సుచిత్ర అన్నారు.

Telugu Chiranjeevi, Jr Ntr, Ram Charan, Sr Ntr, Tollywood-Movie

నేను పని చేసిన వాళ్లలో చిరంజీవి బెస్ట్ డ్యాన్సర్ అని బ్యాడ్ డ్యాన్సర్ అని ఎవరి గురించి చెప్పలేదని ఆమె కామెంట్లు చేయడం చేశారు.కొంతమంది డ్యాన్స్ సరిగ్గా చేయకపోయినా ఆ డ్యాన్స్ ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారంటే గ్రేట్ అని సుచిత్ర తెలిపారు.ఎవరైనా కూడా బెస్ట్ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తారని ఆమె కామెంట్లు చేశారు.

సీనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ గురించి సుచిత్ర మాట్లాడుతూ అప్పట్లో డ్యాన్స్ వేరేలా ఉండేదని సుచిత్ర పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube