పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో చెడ్డి గ్యాంగ్ హాల్ చల్ చేసిన సంఘటన పట్టణ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.వారం రోజుల క్రితం సొసైటీ కాలనీలో ని హేమశ్రీ ప్రైడ్ అనే అపార్టుమెంట్లో 107 బ్లాక్ లో అర్ధరాత్రి చెడ్డిగ్యాంగ్ దొంగతనానికి పాల్పడి విఫలమయ్యారు.
ముఖాలకు మంకీ క్యాప్ లు,చేతిలో ఇనుప రాడ్లు చేతబూని అపార్ట్మెంట్ లోకి చొరబడ్డారు.నలుగురు గ్యాంగ్ అపార్ట్మెంట్ లోని తాళం వేసి ఉన్న ఇల్లు లక్ష్యంగా చేసుకొని వాటిని పగల గొట్టేందుకు ప్రయత్నించారు.
అవి రాక పోవడంతో వెనుదిరిగారు.ఈ దృశ్యాలు సిసి కెమెరాల్లో రికార్డ్ కావడం వల్ల అపార్ట్మెంట్ నిర్వాహకులు పోలీసులను ఆశ్రయించారు.
ఇదిలాఉండగా పట్టణంలోని ఓల్డ్ టౌన్ లో మహిళా కానిస్టేబుల్ ఇంట్లో చోరీ జరిగి సుమారు మూడు లక్షల విలువైన బంగారు ఆభరణాలు అపహరణకు గురైంది.సదరు మహిళా కానిస్టేబుల్ కుటుంబంతో కలసి తిరుపతికి వెళ్లడంతో ఈ చోరీ జరిగింది.
పట్టణంలో రాత్రి వేళల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీకి పాల్పడుతున్నారు.చెడ్డి గ్యాంగ్ చోరీకి యత్నించిన అపార్టుమెంట్ పక్కనే ఉన్న మరో అపార్ట్మెంట్ లో ఒక సిఐ,ఎస్సై నివాసం ఉండటం గమనార్హం.
దీనిపై పట్టణ సిఐబాలకృష్ణ వివరణ కోరగా చోరీకి యత్నం జరిగింది.పోలీసులను అప్రమత్తం చేశాం.
రాత్రి గస్తీలను మరింత ముమ్మరం చేస్తామని చెప్పారు.