ప్రమాదకర పరిస్థితిలో డెక్కన్ స్టోర్ భవనం

హైదరాబాద్ రాంగోపాల్ పేటలోని డెక్కన్ స్టోర్ భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

 Deccan Store Building In Precarious Condition-TeluguStop.com

ఓ వైపు ఆర్పివేస్తుండగా… మరోవైపు మంటలు చెలరేగుతున్నాయి.దీంతో రెస్క్యూ ఆపరేషన్ కష్టంగా మారింది.

ఈ క్రమంలో నే భవనమంతా మంటలు వ్యాపించడంతో డెక్కన్ స్టోర్ భవనం ప్రమాదకరస్థితికి చేరుకుంది.అంతేకాకుండా భవనం లోపల 3, 4 అంతస్తుల స్లాబులు కూలినట్లు తెలుస్తోంది.

రెగ్జిన్ మెటీరియల్స్ తో పాటు కార్లకు సంబంధించిన ఫైబర్ మెటీరియల్ అగ్నికి ఆహుతి అయింది.కాగా ఫైబర్ సింథటిక్ మెటీరియల్స్ కారణంగా రెండు స్లాబులు కూలినట్లు సమాచారం.

ఒక్కొక్క స్లాబ్ కూలుతుండటంతో పాటు క్రమంగా పక్క భవనాలకు సైతం మంటలు వ్యాపిస్తుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube