రాజధాని విషయంలో జగన్ పెద్ద బాంబు పేల్చనున్నాడా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న తర్వాత నుండి అసలు ఆంధ్రప్రదేశ్ లో ఒక రాజధాని కేంద్రంగా ఎలాంటి పనులు సక్రమంగా జరగలేదు.పైగా అమరావతిలో ఉన్న ఇన్వెస్టర్లను కంపెనీలను తరిమికొట్టారు.

 Ys Jagan Facing Problems With Ap Capital,ap Capital,ys Jagan,jagan Government,am-TeluguStop.com

వేలాది కోట్లతో శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు ఆగిపోయాయి.వేల ఎకరాలు ఇచ్చిన రైతులు అన్యాయం అయిపోయారు.

అయితే వీటన్నింటి మధ్య కోర్టులో కేసులు నడుస్తుండగానే జగన్ ఆంధ్రప్రదేశ్ కు కేవలం విశాఖపట్నం రాజధాని అని చెప్పే అవకాశం ఉందట.త్వరలోనే వైజాగ్ లో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఇన్వెస్టర్ల మీట్ జరుపనుంది.

వచ్చినవారు కచ్చితంగా రాష్ట్రానికి రాజధాని ఏది అని అడుగుతారు.ఎందుకంటే అందరి దృష్టిలో మొదటి నుండి అమరావతి ఆంధ్రప్రదేశ్ అధికారిక రాజధాని.

Telugu Amaravati, Ap, Jagan, Visakhapatnam, Ys Jagan-Political

అయితే జగన్ మాత్రం వెంటనే ఎలాంటి సంకోచం లేకుండా విశాఖపట్నం రాజధానిగా చూపించేస్తారట.ఇదే కనుక జరిగితే జగన్ కు న్యాయపరమైన ఇబ్బందులు కూడా తప్పవు.జనవరి 31వ తేదీన అమరావతి రాజధానికి సంబంధించిన కేసు ఒకటి సుప్రీంకోర్టులో విచారణ ఉంది.మొత్తం 261 ప్రతివాదలకు కోర్టు వారు నోటీసులు కూడా జారీ చేశారు.

ఇక్కడ తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే సుప్రీంకోర్టు స్టే విధించే అవకాశం ఉంది.లేకపోతే మళ్లీ షరా మామూలే.అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా స్టే వచ్చి తీరుతుంది అన్న నమ్మకంతో ఉన్నారు.

Telugu Amaravati, Ap, Jagan, Visakhapatnam, Ys Jagan-Political

సరే రాకపోయినా ఎలాగో ప్రభుత్వం ఎక్కడినుండి అయినా పాలించవచ్చు అనే ఒక చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని రాజధాని రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం కనుక వారు బహిరంగ లేదా అధికారికంగా ఇలా ప్రకటించవచ్చు అనే ఆలోచనలో ఉన్నారట.అయితే ఇక్కడే ఒక మెలిక ఉంది.

ఒకవేళ వైజాగ్ కనుక అధికారిక రాజధాని అని ప్రకటిస్తే అమరావతి ప్రాజెక్టుని పూర్తిగా ఆపివేయవలసిందే.

అప్పుడు వేల కోట్లు అమరావతి రైతులకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది.అందుకు మన రాష్ట్ర ప్రభుత్వం ఖజానాల్లో చిల్లి గవ్వ కూడా లేకపోయే.కాబట్టి ఎటుచూసినా జగన్ పూర్తిగా ఇరుక్కుపోయి ఉన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube