టాలీవుడ్ లో సంక్రాంతి సీజన్ లో పెద్ద సినిమాలు బరిలోకి దిగుతున్నాయి.ప్రతి ఏడాది లాగానే వచ్చే ఏడాది 2023 సంక్రాంతి కూడా రసవత్తరమైన పోరు జరగనుంది.
మరి ఇప్పటికే ఈ బరిలో నాలుగు సినిమాలు వస్తున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది.నాలుగు కూడా పెద్ద సినిమాలే.
అందులో తెలుగు నుండి రెండు సినిమాలు అయితే తమిళ్ నుండి రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఈ చతుర్ముఖ పోటీలో ఎవరు విన్ అవుతారా అని ఫ్యాన్స్ సైతం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.
సంక్రాంతి బరిలో వీరసింహ రెడ్డి సినిమాతో బాలయ్య, వాల్తేరు వీరయ్య సినిమాతో చిరంజీవి, విజయ్ దళపతి ‘వరిసు’ సినిమాతో, అజిత్ కుమార్ ‘తునివు’ సినిమాతో బరిలోకి దిగుతున్నారు.
దీంతో మన టాలీవుడ్ సీనియర్ హీరోల ఇద్దరితో తమిళ్ స్టార్స్ పోటీ పడబోతున్నారు.
వాల్తేరు వీరయ్య సినిమా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.
ఇక బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహ రెడ్డి సినిమా చేస్తున్నాడు.వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారసుడు తెరకెక్కువుతుండగా.హెచ్ వినోద్ దర్శకత్వంలో తునివు తెరకెక్కుతుంది.
ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వీరసింహ రెడ్డి, వారసుడు, తునివు ఒకే రన్ టైంతో రాబోతున్నట్టు తెలుస్తుంది.ఈ మూడు సినిమాల గంటల 40 నిముషాల నిడివితో వస్తున్నాయట.
వీటిపై అధికారిక క్లారిటీ అనేది రావాల్సి ఉంది.మరి చిరు వాల్తేరు వీరయ్య మాత్రం దీని కంటే తక్కువ రన్ టైంతో రానుందట.
చూడాలి ఈ పోటీలో ఎవరు నెగ్గుతారో.