డయాబెటిస్ ఉన్నవారు ఉపవాసం పాటిస్తే మంచిదో కాదో తెలుసా..

మన దేశవ్యాప్తంగా చాలా మంది ప్రజలు అప్పుడప్పుడు పండుగల సందర్భంగా ఉపవాసం ఉంటారు.ముఖ్యంగా డయాబెటిస్ బాధితులు అయితే ఉపవాసం ఎలా ఉండాలో అని ఆలోచిస్తూ ఉంటారు.

 Do You Know If Fasting Is Good For People With Diabetes , Diabetes, Health , Hea-TeluguStop.com

ఇలాంటి వారికి ఇది శుభవార్త అని చెప్పాలి.ఎందుకంటే చక్కర వ్యాధి బాధితులైన సరే ఫాస్టింగ్ ఉండవచ్చని ఇది డయాబెటిస్ నివారణకు ఎంతో ఉపయోగపడుతుందని ఒక అధ్యయనంలో తెలిసింది.

ప్రతి సందర్భంలో కాకపోయినా అప్పుడప్పుడైనా ఉపవాసం ఉండడం అనేది చాలా కుటుంబాలలో ఆనవాయితీగా వస్తుంది.వారానికి ఒక్కసారైనా లేదా పండుగలప్పుడు అయినా ప్రత్యేక పూజలు, వ్రతాల సమయాలలో ఉపవాసం ఉండేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

ఇంకొంత మంది బరువు పెరుగుతామేమో అనే భయంతో ,మరికొందరు బరువు తగ్గాలని ఆశతో ఉపవాసం పటిస్తూ ఉంటారు.కారణమేదైనా ఉపవాసం ఉండడం ఎంతో మేలు అని ఇది చక్కర వ్యాధిని తగ్గిస్తుందని, అంతేకాకుండా అధిక బరువు సమస్యను కూడా నివారిస్తుందని కొన్ని అధ్యయన పరిశోధనలలో తేలింది.

ఆరోగ్యం, ఆనందం, భక్తి కూడా ఇమిడి ఉండడంతో చాలామంది ఉపవాసం ఉండడానికి ఇష్టపడుతున్నారు.కానీ డయాబెటిస్ ఉన్నవారు ఉపవాసం ఉంటే ఏమైనా ఆరోగ్యానికి ప్రమాదం ఉందా అనేది చాలామంది ఆలోచిస్తూ ఉంటారు.

దీనిపై ఒక అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలకు చక్కర వ్యాధిగ్రస్తులు కూడా ఉపవాసం ఉండవచ్చని స్పష్టం చేశారు.డయాబెటిస్ నివారించడంలో ఉపవాసం ఏవిధంగా తోడ్పడుతుందని అధ్యయనంలో భాగంగా శాస్త్రవేత్తలు 38 నుంచి 72 సంవత్సరాల వయసు గల వారిపై ఈ ప్రయోగం చేశారు.

Telugu Calcium, Diabetes, Fiber, Tips, Multi Vitamins, Protein-Latest News - Tel

ఈ అధ్యయనం ప్రకారం మూడు నెలల పాటు అప్పుడప్పుడు ఉపవాసం ఉన్నవారికి చక్కెర వ్యాధి తగ్గుతుందని వారు ఈ పరిశోధనలో గుర్తించారు.ఇలా ఉపవాసం ఉన్నవారు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలంటే ఎక్కువగా ఫైబర్, ప్రోటీన్, క్యాల్షియం మల్టీ విటమిన్లు ఉండే ఆహారాన్ని తీసుకోవడం ఎంతో మంచిది.కేవలం పోషకాహారమే కాకుండా తగినంత నీరు కూడా తాగాలి.అంతేకాకుండా టైప్ టు డయాబెటిస్ తగ్గించుకోవాలంటే శరీరక శ్రమ ఉండాలి.నిద్రలేమి అసలు ఉండకూడదు.పోషకాహార లోపం కూడా ఉండకూడదు.

ఇంకా చెప్పాలంటే ఆరోగ్యకరమైన ఆహారాలను అలవాటు చేసుకోవడం కూడా ఎంతో మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube