చలికాలంలో ఆస్తమా అదుపులో ఉండాలంటే ఇలా చేయండి!

ఆస్తమా లేదా ఉబ్బ‌సం.ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది దీని బాధితులుగా ఉన్నారు.

 Do This To Keep Asthma Under Control In Winter! Winter, Asthma, Latest News, Hea-TeluguStop.com

అయితే మిగిలిన సీజన్లతో పోలిస్తే ప్రస్తుత చలికాలంలో ఆస్తమా బాధితులు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు. గురక, ఛాతి బిగుతుగా మారడం, దగ్గు, ఆయాసం, పిల్లి కూత‌లు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తదితర ఆస్తమా లక్షణాలన్నీ ఈ సీజన్ లో తీవ్ర తరంగా మారి ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంటాయి.

అందుకే చలికాలంలో ఆస్తమా వ్యాధి ఉన్న వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.ముఖ్యంగా ఆస్తమాను అదుపులో ఉంచుకోవాలంటే కొన్ని కొన్ని ఆహారాల‌ను డైట్లో చేర్చుకోవాలి.

ప్రస్తుత చలికాలంలో ఆస్తమా రోగులు పాలు, గుడ్లు, చాపలు వంటి ఆహారాల‌ను అధికంగా తీసుకోవాలి.వీటిలో ఉండే విటమిన్ డి ఆస్తమా లక్షణాలను కంట్రోల్ చేయడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

అలాగే విటమిన్ ఏ పుష్కలంగా ఉండే క్యారెట్, ఆకుకూరలు, చిలకడ దుంపల తో పాటు అవకాడో, బొప్పాయి వంటి పండ్లను డైట్ లో చేర్చుకోవాలి.ఇవి ఆస్తమా లక్షణాల నుంచి ఉపశమనం కలిగించడంలో సూప‌ర్ గా హెల్ప్ చేస్తాయి.

అలాగే ఆస్తమా బాధితులు యాపిల్, గుమ్మడి గింజలు వంటి ఆహారాలు తీసుకోవాలి.ఇవి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను తొలగిస్తాయి.

అంతేకాదు ఆస్తమా స‌మ‌స్య‌తో బాధ ప‌డుతున్న‌ వారు ఉల్లి, వెల్లుల్లి, క్యాబేజీ, సాఫ్ట్ డ్రింక్స్ వంటి వాటిని దూరం పెట్టాలి.ఇవి ఆస్తమా లక్షణాలను మరింత తీవ్ర త‌రంగా మారుస్తాయి.

నూనెలో వేయించిన ఆహారాలు, బేక‌రీ ఫుడ్స్‌, ఫాస్ట్ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్‌, ప్రాసెస్‌ చేసిన పదార్థాలు వంటి వాటిని సైతం తీసుకోరాద‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.ఇక ఆస్తమా బాధితులు ప్రతి రోజూ కనీసం ఇర‌వై నిమిషాలు అయినా వ్యాయామాలు చేయాలి.ఒత్తిడికి దూరంగా ఉండాలి.ధూమ‌పానం, మధ్యపానం అలవాట్లు ఉంటే వదులుకోవాలి.అప్పుడే ఆస్తమా అదుపులో ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube