తూళ్లూరులో అమరావతి రైతులు సమావేశం అయ్యారు.అమరావతి ఉద్యమాన్ని జాతీయస్థాయికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు.
ఉద్యమానికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో నిరసన కార్యక్రమం నిర్వహించాలని రైతులు తీర్మానించారని తెలుస్తోంది.రాజధానికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో ఉన్నందున ఢిల్లీలో ప్రదర్శన చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ క్రమంలో ధర్మాసనం తుది తీర్పు వెలువరించే వరకు ఉద్యమం కొనసాగించాలని రైతులు నిశ్చయించుకున్నారు.కాగా డిసెంబర్ 17తో అమరావతి రైతుల ఉద్యమానికి మూడు సంవత్సరాలు పూర్తి కానున్నాయి.