ఆదిలాబాద్ కలెక్టరేట్లో వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం సృష్టించింది.ప్రజావాణిలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.
వెంటనే గమనించిన కలెక్టర్ కార్యాయలం సిబ్బంది మంటలను ఆర్పివేశారు.కాగా వ్యక్తి ముఖానికి తీవ్ర గాయాలు కావడంతో హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు.
తనను హిజ్రాతో పోలుస్తూ హేళన చేస్తున్నారంటూ బాధిత వ్యక్తి వాపోతున్నాడు.