భారతదేశంలో చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నారు.వీరి డేటాను ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యతను కేంద్ర ప్రభుత్వం భుజాలకి ఎత్తుకుంది.
ఇందులో భాగంగా ‘2022 డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు‘కు సంబంధించిన ముసాయిదాను రిలీజ్ చేసింది.పర్సనల్ డేటాను చెడు కోసం ఉపయోగించిన టెక్ కంపెనీలకు గరిష్ఠంగా రూ.500 కోట్ల వరకు ఫైన్ విధించడం సహా ఇంకా తదితర కీలక అంశాలను ముసాయిదా బిల్లులో ప్రతిపాదించింది.ప్రస్తుత డిజిటల్ యుగంలో డేటా వినియోగానికి సంబంధించి రూల్స్, చట్టాలను తీసుకురావడం తప్పనిసరి అని కేంద్రం అభిప్రాయపడింది.
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లులో భాగంగా.ఒక విచారణ బోర్డును ఏర్పాటు చేస్తామని కూడా కేంద్రం వెల్లడించింది.డేటాను కలెక్ట్ చేసే గూగుల్, ఫేస్‌బుక్ వంటి సంస్థలు.ఆ డేటాకు తగిన ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతే.
.రూ.250కోట్ల వరకు ఫైన్ విధించేలా ఈ బిల్లులో నిబంధనలు తెచ్చినట్లు పేర్కొంది.ఈ బిల్లును క్షుణ్ణంగా చదివితే.
డేటా బ్రీచ్ జరగకుండా కేంద్రం కఠిన ఆంక్షలు తీసుకొస్తున్నట్లు స్పష్టం అవుతుంది.
అలాగే ఈ ప్రతిపాదనలో డేటా బ్రీచ్ జరిగిందని విచారణ బోర్డుకు తెలియజేయకపోయినా.పిల్లలకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రత్యేక నిబంధనలను సరిగ్గా అమలు చేయకపోయినా.రూ.200కోట్ల వరకు ఫైన్ విధించాలని కేంద్రం పేర్కొంది.ఈ బిల్లు అమల్లోకి వచ్చిన తర్వాత.
తల్లిదండ్రుల అనుమతితోనే వారి పిల్లల డేటాను కలెక్ట్ చేయాల్సి ఉంటుంది.ఇంకా డేటా ప్రొటెక్షన్ కోసం మరిన్ని నిబంధనలను కేంద్రం తీసుకొస్తోంది.
ఈ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ ముసాయిదా బిల్లును ప్రజల అభిప్రాయాల కోసం అందరికీ అందుబాటులో కూడా ఉంచింది.ఈ బిల్లుపై డిసెంబర్ 17 లోగా ఎవరైనా సరే తమ అభ్యంతరాలను వ్యక్తపరచొచ్చు అలాగే సలహాలను అందించవచ్చు.