Supreetha Marriage: పెళ్లి ఎప్పుడని అడుగుతున్నారు.. సురేఖా వాణి కూతురు సుప్రీత రీల్ వైరల్!

ఈమధ్య ప్రతి ఒక్కరూ తెగ వీడియోస్ చేస్తూ బాగా సందడి చేస్తున్నారు.మామూలుగా పాటల వీడియోలే కాకుండా డైలాగ్స్ తో వచ్చే రీల్స్ కూడా చేస్తున్నారు.

 Surekha Vani Daughter Supreetha About Her Marriage Details, Surekha Vani, Surekh-TeluguStop.com

సామాన్యులే కాదు సెలబ్రెటీలు కూడా రీల్స్ చేస్తూ కాలక్షేపాన్ని చేస్తున్నారు.అయితే తాజాగా మరో సెలబ్రిటీ కూతురు కూడా రీల్ చేయగా ప్రస్తుతం అది వైరల్ అవుతుంది.

ఇంతకు ఆ సెలబ్రిటీ కూతురు ఎవరో కాదు సురేఖ వాణి కూతురు సుప్రీత. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఆర్టిస్ట్ సురేఖ వాణి గురించి తెలుగు ప్రేక్షకులందరికీ బాగా పరిచయం.

ఈమె ఎక్కువగా అక్క, వదిన వంటి పాత్రలలో చేసింది.ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది.

ఇక ఈమెకు సుప్రీత అనే కూతురు కూడా ఉంది.ఇప్పటివరకు ఇండస్ట్రీ పరిచయం లేని సుప్రీత కేవలం తన తల్లి ద్వారా పరిచయం పెంచుకుంది.

ఇదే కాకుండా సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది.సోషల్ మీడియా ద్వారా కూడా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది.నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూ బాగా రచ్చ చేస్తుంది.తన తల్లి ద్వారా ఈమెకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది.

తన తల్లి సురేఖ వాణి కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా మారి కూతురు కంటే ఎక్కువగా రచ్చ చేస్తుంది.

ఇక వీరిద్దరూ కలిసి చేసే డాన్స్ వీడియోలు మాత్రం బాగా వైరల్ అవుతూ ఉంటాయి.సురేఖ వాణి మాత్రం తన స్టైల్ మొత్తం మార్చేసింది.భర్త చనిపోయాక మరింత గ్లామర్ ని పెంచింది.

చీర కట్టును వదిలేసి మోడ్రన్ డ్రెస్సులు వేస్తూ రచ్చ చేస్తుంది.ఇక తను తన కూతురు పకపక్కన ఉంటే అక్క చెల్లిల్లాగా కనిపిస్తూ ఉంటారు.

వీరిద్దరూ ఒకరికి ఒకరు తోడు అన్నట్లుగా జీవిస్తున్నారు.ఇద్దరు కలిసి ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.అంతేకాకుండా లేట్ నైట్ పార్టీస్ అంటూ బాగా సందడి చేస్తారు.వీరి నుండి ఏదైనా పోస్టు వస్తే చాలు అది క్షణాల్లో వైరల్ అవుతుంది.

ఇక ఈమధ్య సుప్రీత నటిగా కూడా పరిచయం అయింది.పలు సిరీస్ లలోనే కాకుండా ఆ మధ్య ఓ సినిమాతో వెండితెరకు కూడా పరిచయమైంది.

సుప్రీత పోస్ట్ చేయని రోజే లేదు.ప్రతిరోజు తన ఫోటోలను పంచుకోటమే కాకుండా తన డాన్స్ వీడియోలను కూడా బాగా షేర్ చేస్తుంది.అయితే తాజాగా తను చేసిన రీల్ వీడియో పంచుకుంది.సోషల్ మీడియా ప్రియులకు ఉప్పల్ బాలు తెలిసే ఉండొచ్చు.ఇక అతడు పెళ్లి గురించి మాట్లాడిన వాయిస్ క్లిప్ ను రీల్ గా చేసింది సుప్రీత.

అందులో తనకు పెళ్లి కాలేదు అని, తనను ఎవరు ప్రేమించలేదు అని.అందరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని అడుగుతున్నారు అని ఉండగా సుప్రీత దానికి రీల్ చేస్తూ తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube