రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది.హత్య కేసులో దోషులుగా ఉన్న నళిని, ఆర్పీ రవిచంద్రన్ ను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు జీవిత ఖైదు అనుభవిస్తున్న మొత్తం ఆరుగురు దోషులను విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది.రాజీవ్ హత్య అనంతరం నళిని, రవిచంద్రన్ లు అరెస్ట్ అయ్యారు.
నళినితో పాటు ఇతర దోషులు ఇన్ని రోజులుగా చెన్నై సెంట్రల్ జైలులో శిక్షను అనుభవిస్తున్నారు.ఈ క్రమంలోనే ఓ సారి నళిని, ఇతర దోషులను రాజీవ్ కుటుంబ సభ్యులు జైలులో కలిశారు.
దోషులను క్షమించానని గతంలోనే సోనియా గాంధీ ప్రకటించిన విషయం తెలిసిందే.