రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం సంచలన తీర్పు

రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది.హత్య కేసులో దోషులుగా ఉన్న నళిని, ఆర్పీ రవిచంద్రన్ ను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ మేరకు జీవిత ఖైదు అనుభవిస్తున్న మొత్తం ఆరుగురు దోషులను విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది.

రాజీవ్ హత్య అనంతరం నళిని, రవిచంద్రన్ లు అరెస్ట్ అయ్యారు.నళినితో పాటు ఇతర దోషులు ఇన్ని రోజులుగా చెన్నై సెంట్రల్ జైలులో శిక్షను అనుభవిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఓ సారి నళిని, ఇతర దోషులను రాజీవ్ కుటుంబ సభ్యులు జైలులో కలిశారు.

దోషులను క్షమించానని గతంలోనే సోనియా గాంధీ ప్రకటించిన విషయం తెలిసిందే.

జాగ్రత్త సుమీ.. గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే!