Physics Teacher: వైరల్: ఆదర్శవంతమైన టీచర్... వినూత్న రీతిలో పిల్లలకు పాఠాలు!

నేటి విద్యావ్యవస్థ ఎలా వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇక టీచర్లు కూడా ఏదో మొక్కుబడిగా పాఠాలు చెబుతున్నారు తప్ప, శ్రద్ధ పెట్టి చదువు చెప్పే టీచర్స్ అరుదనే చెప్పుకోవాలి.

 Viral Video Physics Teacher Unique Way Of Explaining Concepts Details , Teacher,-TeluguStop.com

ఇలాంటి అరుదైన టీచర్స్ పాఠశాలలో పిల్లల‌కు అర్థమ‌య్యేలా పాఠాలు చెప్పడం కోసం ఎన్నో వినూత్న పద్ధతులను అవలంబిస్తుంటారు.ఈ క్రమంలో కొంద‌రు త‌ర‌గ‌తినే ప్రయోగ‌శాల‌ని చేస్తారు.

తాజాగా అలాంటి టీచర్ ఒకరు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.ఇక్కడి ఫిజిక్స్ టీచ‌ర్ తరగతిలో పిల్లలకు అర్థమయ్యేలా పాఠాలు చెప్పడం కోసం తరగతినే ప్రయోగశాలగా మార్చేశాడు.

అవును, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఒక్కసారి చూస్తే, ఓ ఫిజిక్స్ టీచరు తరగతిలో వ‌క్రీభ‌వ‌నం గురించి పిల్లల‌కు చిన్న ప్రయోగం ద్వారా అరటిపండు వలిచి నోట్లో పెట్టిన మాదిరిగా వివరించి చెప్పడం మనం చూడవచ్చును.గాలి, గ్లాస్‌.

ఈ రెండింటికి వ‌క్రీభ‌వ‌నం గుణ‌కం వేరుగా ఉంటుంద‌ని చెప్పడం కోసం.రెండు గ్లాస్‌లు, వంట‌నూనె డ‌బ్బా తీసుకొని సరాసరి క్లాస్‌రూమ్‌కి వెళ్లాడు.

ముందుగా బ్లాక్ బోర్డ్ మీద బొమ్మలు గీసి పిల్లల‌కు వ‌క్రీభ‌వ‌నం పాఠం థియరీ చెప్పాడు.ఆ త‌ర్వాత దాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపించాడు.

ఈ క్రమంలో ఒక గ్లాస్‌లో 1/4 శాతం వ‌ర‌కు వంట‌నూనె పోశాడు.

తరువాత ఆ గాజు గ్లాస్‌ని చేతిలో ప‌ట్టుకుని పిల్లల‌కు చూపించి, నూనె ఉన్న గ్లాస్ భాగం క‌నిపిస్తుందా? అని క్లాసులో పిల్లల్ని అడిగాడు.పిల్లలు లేద‌ని చెప్పడంతో… గ్లాస్‌, వంట‌నూనె వ‌క్రీభ‌వ‌న గుణ‌కం స‌మానంగా ఉంటాయ‌ని, అందుకే కనబడలేదని వివ‌రించాడు.రెండు వ‌స్తువులు, ప‌దార్థాల వ‌క్రీభ‌వ‌న గుణ‌కం స‌మానంగా ఉన్నప్పుడు వాటిగుండా కాంతి ప్రస‌రించ‌దు, ఎందుకంటే గాలి, గ్లాస్‌ వ‌క్రీభ‌వ‌న గుణ‌కం ఒకేలా ఉండ‌దు.

అందుక‌నే గాలితో నిండిన గ్లాస్ భాగం క‌నిపించింది అంటూ వివ‌రించాడు.ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ ఫిజిక్స్ టీచర్ ని ఆకాశానికెత్తేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube