తెలుగు బుల్లితెర పేక్షకులకు బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట సోషల్ మీడియాలో డబ్బు స్మాష్ వీడియోల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న అషు రెడ్డి ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని సంపాదించుకున్న విషయం తెలిసిందే.
అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ లోకి రెండుసార్లు ఎంట్రీ ఇచ్చింది.అలా సోషల్ మీడియా ద్వారా ఎంట్రీ ఇచ్చిన అషు రెడ్డి అతి తక్కువ సమయంలోనే సెలబ్రిటీ హోదాను దక్కించుకుంది.
అలాగే ఈమె టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ని ఇంటర్వ్యూ చేసి బోల్డ్ బ్యూటీగా కూడా గుర్తింపు తెచ్చుకుంది.
అంతేకాకుండా ఈమె యాంకర్ గా కూడా ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.
తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ భారీ పాపులారిటీని సంపాదించుకుంది ఈ బిగ్ బాస్ బ్యూటీ.అంతే కాకుండా ఈమె జూనియర్ సమంత గా కూడా పేరు తెచ్చుకుంది.
అషు రెడ్డి సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.ఈమెకు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది.ఎప్పటికప్పుడు ఈమె సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్లు బికినీ ఫోటో షూట్లు చేస్తూ కుర్ర కారుకు చెమటలు పట్టిస్తూ ఉంటుంది.బోల్డ్ ఫోటోలు షేర్ చేయడం మాత్రమే కాకుండా బోల్డ్ గా మాట్లాడుతూ బోల్డ్ గా పోస్ట్ లు కూడా చేస్తూ ఉంటుంది అషు రెడ్డి.
ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో ఈమెపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ భారీగా జరుగుతున్నాయి.
డ్రెస్సింగ్ విషయంలో ఆమె చేసే పనుల విషయంలో నెటిజెన్స్ ఆమె పై ట్రోలింగ్స్ చేస్తున్నారు.ఇక తనపై ట్రోలింగ్స్ చేసే వారికి అషు రెడ్డి తనదైన శైలిలో స్ట్రాంగ్ గా ఉంటుంది.ఇది ఇలా ఉంటే తాజాగా అషు రెడ్డి ఒక రీల్ ని పోస్ట్ చేస్తూ తనపై ట్రోలింగ్స్ చేసే వారికి గట్టిగా బుద్ధి చెప్పింది.
ఆ వీడియోలో ఆమె దేశముదురు సినిమాలో రమాప్రభా చెప్పిన విధంగా కామాతురామనం డైలాగ్ ను చెప్పి ఆకట్టు ఉంది.కామా పురాణం.నా భయం, నా లజ్జ.కామంతో కళ్ళు మూసుకుపోయిన వెధవకి,సిగ్గు,లజ్జ,భయం,భక్తి ఏమీ ఉండవు అని ఆ వీడియోలో చెప్పుకొచ్చింది.
అయితే ఆ డైలాగు ఎవరిని ఉద్దేశించి చేసింది అన్నది నెటిజన్స్ కి బాగా అర్థం అయిపోయింది.కాకుండా ఆమె ఆ వీడియోని షేర్ చేస్తూ నా ప్రొఫైల్లో కామెంట్ చేసే కొందరికి ఈ వీడియో అంకితం చేస్తున్నాను అని రాసుకొచ్చింది అషు రెడ్డి.
కదా ఆమె షేర్ చేసిన ఆ వీడియో పై స్పందించిన పలువురు నెటిజన్స్ మొదటిది అవన్నీ ఉన్నాయా అంటూ ఆమెని ప్రశ్నిస్తున్నారు.