ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబులకు ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.మధ్యాహ్నం ఒంటి గంటలకు వీరిని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు.
లిక్కర్ కుంభకోణంలో శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబుల పాత్రపై ఈడీ కోర్టుకు అధికారులు రిమాండ్ రిపోర్ట్ ఇవ్వనున్నారు.శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబులు దర్యాప్తునకు సహకరించకపోవడంతో కస్టడీకి కోరనున్నారని తెలుస్తోంది.
ట్రైడెంట్ లైఫ్ సైన్సెన్ కంపెనీ ద్వారా హవాలా రూపంలో నగదు లావాదేవీలకు పాల్పడ్డారని శరత్ చంద్రారెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి.ఈ మేరకు మనీలాండరింగ్ కేసు నమోదు చేసి ఈడీ అధికారులు విచారించనున్నారు.