Uttam Kumar Reddy Jana Reddy: మునుగోడులో డిపాజిట్లు గల్లంతు.. ఫుల్ హ్యాపీగా కాంగ్రెస్ సీనియర్ నేతలు?

మునుగోడు ఉపఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టీఆర్ఎస్ పార్టీ భారీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.అలాగే ఈఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్‌కు భారీ నష్టం వాటిల్లింది.

 T Congress Seniors Are Full Happy With Deposit Loss , Ktr, India Today Telangan-TeluguStop.com

నిజానికి మునుగోడు కాంగ్రెస్‌ సిట్టింగ్‌ సీటు.ఇక్కడ గెలవాల్సింది పోయి అవమానకరంగా ఆ పార్టీ డిపాజిట్‌ కోల్పోయింది.

కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డికి కేవలం 23,906 ఓట్లు రావడంతో కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు భారీగా గండిపడింది. స్పష్టంగా ఈ ఫలితం ఊహించబడిందే అయినప్పటికీ ఈ ఫలితాలు కాంగ్రెస్ లో ఉన్న అంతర్గత విభేదాలు బయటపెట్టింది.

టీ-కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా చివరిలో టీ-పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో మునుగోడుపై పెద్దగా దృష్టి సారించి పెద్దగా ప్రచారం చేయలేదు.అయితే మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలపై టీ-కాంగ్రెస్‌లోని ఒక వర్గం నేతలు సంతోషంగా ఉన్నారు వారలో మాజీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానా రెడ్డి, జగ్గా రెడ్డి, మధుయాష్కీ గౌడ్‌తో పాటు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న వారంతా ఈ లిస్ట్‌లో  ఉన్నారు.

  వారు మునుగోడు ఉప ఎన్నికలో చురుకుగా పని చేయలేదు.

Telugu Indiatelangana, Jagga Reddy, Jana Reddy-Political

మరోవైపు మరో సీనియర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రచారానికి పూర్తిగా దూరమయ్యారు.   తన సోదరుడు పోటీ చేస్తున్నందున బీజేపీకి ఓటేయాలని తన అనుచరులను  వెంకట్ రెడ్డి  కోరినట్లు ఆడియో టేపులు బయటపడ్డాయి.ఎన్నికల ప్రచారం చేయకుండా  ఉండడానికే వెంకట్ రెడ్డి  ఆస్ట్రేలియా  పర్యటన వెళ్ళినట్లు పలువురు నేతలు అంటున్నారు.

సీనియర్లంతా నిజాయితీగా కాంగ్రెస్, స్రవంతి కోసం ఉప ఎన్నికలో పనిచేసి ఉంటే ఆ పార్టీకి డిపాజిట్లు దక్కి, ఇప్పటికీ తమ ఓటు బ్యాంకు చెక్కుచెదరలేదని నిరూపించుకునేవారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండడంతో సీనియర్లు ఎన్నికలను సీరియస్ గా తీసుకోలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube