బుల్లితెర జోడీలలో సుధీర్ రష్మీ జోడీ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకోవడంతో పాటు ఫ్యాన్స్ కు దగ్గరయ్యారు.అయితే గత కొంతకాలంగా సుధీర్ జబర్దస్త్ షోకు దూరంగా ఉండటంతో సుధీర్ రష్మీలను ఒకే స్టేజ్ పై చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కలేదు.
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా ప్రమోషన్లలో భాగంగా సుధీర్ తో ప్రేమ, పెళ్లి గురించి రష్మీ స్పందించి షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సుధీర్ కు నాకు మధ్య ఉన్న బంధం ఏదైనా కావచ్చని రష్మీ అన్నారు.
మా మధ్య ఉన్న బంధం గురించి ప్రతి ఒక్కరికీ వివరించలేనని ఆమె చెప్పుకొచ్చారు.కొన్ని విషయాలను నేను నాలోనే దాచుకుంటానని ఆమె కామెంట్లు చేశారు.రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో తెలియదని ఆమె పేర్కొన్నారు.మా ఇద్దరి మధ్య ఏం జరిగినా అది అందరికీ తెలుస్తుందని రష్మీ వెల్లడించడం గమనార్హం.
మేము ఆఫ్ స్క్రీన్ లో ఏ విధంగా ఉంటామో అదే ఆన్ స్క్రీన్ పై కనిపిస్తుందని రష్మీ షాకింగ్ కామెంట్లు చేశారు.మాది పది సంవత్సరాల ప్రయాణం అని రష్మీ చెప్పుకొచ్చారు.మేము అనుకొని అదంతా చేయలేదని రష్మీ వెల్లడించారు.ఒక మ్యాజిక్ ఏ విధంగా ఆకర్షిస్తుందో మా ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ కూడా అదే విధంగా ఆకర్షించిందని ఆమె అన్నారు.

మా ఇద్దరి ఉన్న కెమిస్ట్రీ నిజమేనని రష్మీ క్లారిటీ ఇచ్చేశారు.రాబోయే రోజుల్లో సుధీర్ రష్మీ పెళ్లి చేసుకున్నా షాక్ అవ్వాల్సిన అవసరమే లేదని ఆమె కామెంట్ల ద్వారా క్లారిటీ వచ్చేసింది. రష్మీ కామెంట్ల గురించి సుడిగాలి సుధీర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.సుధీర్ రష్మీలకు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.