Jabardast Shanti Swarup : అమ్మతో కలిసి క్యాష్ షోకు వచ్చిన శాంతి స్వరూప్.. కష్టాలు తలుచుకొని కన్నీళ్లు?

తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది కమెడియన్ లు ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే.అంతేకాకుండా ఈ జబర్దస్త్ షో ఎంతో మంది ఆర్టిస్టులకు లైఫ్ ను ఇచ్చింది.

 Jabardasth Shanthi Swaroop Tears With Her Mother In Cash Promo Video Viral , Jab-TeluguStop.com

ఈ మధ్యకాలంలో స్కిట్ లలో లేడీ గెటప్ లు కాకుండా ఏకంగా లేడీస్ స్కిట్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే.కానీ ఇదివరకు లేడీస్ కి బదులుగా లేడి గెటప్స్ ధరించి మరి ప్రేక్షకులను నవ్వించేవారు.

అయితే జబర్దస్త్ షోలో లేడీ గెటప్ పరిచయం చేసింది చమ్మక్ చంద్ర.ఇక అప్పటినుంచి జబర్దస్త్ లో లేడీ గెటప్స్ హవా నడుస్తూనే ఉంది.

అలా జబర్దస్త్ లో శాంతి స్వరూప్,పవన్,సాయి లీలా,హరిత, చిన్మయ్,ప్రియాంక ఇలా ఎంతోమంది లేడీ గెటప్స్ వేసి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా సుమ హోస్ట్ గా వ్యవహరిస్తున్న క్యాష్ షోకి జబర్దస్త్ లో లేడీ గెటప్ వేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న పలువురు కమెడియన్స్ వాళ్ళ తల్లిదండ్రులతో హాజరయ్యారు.

శాంతి స్వరూప్, మోహన్, హరిత, సాయి లేఖ లు వారి తండ్రులతో వచ్చారు.మిగిలిన వారు వారి తండ్రులతో రాగా శాంతి స్వరూప్ మాత్రం తన తల్లితో క్యాష్ కు వచ్చాడు.

ఈ నేపథ్యంలోనే తన తల్లి పడ్డ కష్టాలను తలుచుకుంటూ.ఎమోషనల్ అయ్యాడు శాంతి స్వరూప్.తన తల్లి గురించి మాట్లాడుతూ.తల్లితో కలిసి స్టేజిపైనే కన్నీటి పర్యంతం అయ్యాడు.మా అమ్మ చాలా ఇళ్లలో పని చేసేదని, అప్పుడు ఆకలి విలువ అంటే ఏటో.మాకు తెలిసి వచ్చింది అంటూ ఫుల్ ఎమోషనల్ అయ్యాడు శాంతి స్వరూప్.ఇక మా అమ్మకు చిన్నతనం నుంచి గొంతు సరిగ్గా రాదని, స్పష్టంగా మాట్లాడలేదని.ఏదో మాట్లాడాలనుకుటుంది కానీ మాట్లాడలేదు.అంటూ కన్నీరు పెట్టుకున్నాడు.ఈ క్రమంలోనే శాంతి స్వరూప్ గురించి తల్లి సరోజనమ్మ మాట్లాడుతూ.

నా కొడుకే నన్ను బతికిస్తున్నాడు.ఆస్పత్రుల చూట్టు తిప్పుతున్నాడు అని కన్నీటి పర్యంతమైంది.

వారి మాటలను వారి బాధను చూసి సుమతో పాటు తోటి కమెడియన్లు కూడా కన్నీరు పెట్టుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube