ఎలాంటి మచ్చలు, మొటిమలు లేకుండా ముఖ చర్మం క్లియర్ గా మెరుస్తూ కనిపించాలని చాలా మంది మగువలు కోరుకుంటారు.కానీ ఎక్కువ శాతం మందికి ఆ కోరిక కోరికగానే మిగిలిపోతుంటుంది.
ఈ క్రమంలోనే క్లియర్ స్కిన్ ను పొందడం కోసం ఖరీదైన చర్మ ఉత్పత్తులను వాడుతుంటారు.అయితే మార్కెట్లో లభ్యమయ్యే ఉత్పత్తుల వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అన్నది పక్కన పెడితే.
ఇప్పుడు చెప్పబోయే ఐస్ క్యూబ్ తో రోజు ఫేస్ ను మసాజ్ చేసుకుంటే క్లియర్ స్కిన్ మీ సొంతం అవుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం క్లియర్ స్కిన్‌ను అందించే ఆ ఐస్ క్యూబ్స్‌ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక బంగాళదుంపని తీసుకుని పీల్ తొలగించి నీటిలో శుభ్రంగా కడగాలి.కడిగిన బంగాళదుంపను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని.మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి బంగాళదుంప జ్యూస్‌ను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి.అలాగే అందులో బంగాళదుంప జ్యూస్ వేసుకోవాలి.చివరిగా రెండు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, నాలుగు టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకుని దోశ పిండి మాదిరి కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని ఐస్ ట్రేలో నింపుకుని నాలుగు గంటల పాటు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.
అనంతరం తయారైన ఐస్ క్యూబ్స్ తీసుకుని ముఖంపై అప్లై చేస్తూ స్మూత్ గా మర్దన చేసుకోవాలి.ఆపై నార్మల్ వాటర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.
ఈ విధంగా రోజు కనుక చేస్తే చర్మంపై మొటిమలు, ముదురు రంగు మచ్చలు, ముడతలు క్రమంగా పోతాయి.చర్మం క్లియర్ అండ్ గ్లోయింగ్ గా మెరిసిపోతూ కనిపిస్తుంది.
పైగా ఈ ఐస్ క్యూబ్స్ తో రెగ్యులర్ గా మసాజ్ చేసుకోవడం వల్ల చర్మం పై పేరుకుపోయిన మురికి, మృత కణాలు సైతం తొలగిపోతాయి.