టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ కు భాషతో సంబంధం లేకుండా అభిమానులు ఉన్నారు.ప్రభాస్ ఏ సినిమాలో నటించినా ఫస్ట్ డే కలెక్షన్లు అంచనాలకు మించి ఉంటాయని ఇండస్ట్రీలో టాక్ ఉంది.
ప్రభాస్ నటించిన సాహో సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంది.హిందీలో ఈ సినిమా అంచనాలకు మించి సక్సెస్ సాధించింది.
ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు కొంతమంది ప్రేక్షకులకు ఎంతగానో నచ్చాయి.నెట్ ఫ్లిక్స్ ఇండోనేషియా సాహో సినిమాలోని ప్రభాస్ వీడియోను పోస్ట్ చేసి ఇదేం యాక్షన్? అంటూ సెటైరికల్ గా ట్వీట్ చేయడం గమనార్హం.ఈ ట్వీట్ ను చూసిన ప్రభాస్ అభిమానులు మండిపడుతున్నారు.ప్రముఖ ఓటీటీ సంస్థలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ ప్రభాస్ ను ఈ విధంగా దారుణంగా అవమానించడం సరి కాదని కామెంట్లు చేస్తున్నారు.
కొంతమంది నెటిజన్లు నెట్ ఫ్లిక్స్ ను అన్ సబ్ స్క్రైబ్ చేస్తామని చెబుతుండగా మరి కొందరు నెట్ ఫ్లిక్స్ ను బ్యాన్ చేయాలని కామెంట్లు చేస్తున్నారు.ప్రభాస్ అభిమానులు మాత్రం నెట్ ఫ్లిక్స్ తీరుపై మండిపడుతున్నారు.
సినిమాసినిమాకు ప్రభాస్ రేంజ్ పెరుగుతుండగా ప్రముఖ ఓటీటీ అయిన నెట్ ఫ్లిక్స్ ప్రభాస్ ను ఎందుకు టార్గెట్ చేస్తోందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

ఈ నెగిటివ్ కామెంట్ల గురించి ప్రభాస్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.ప్రభాస్ నటించిన ఆదిపురుష్ రిలీజ్ డేట్ మారడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పటికే ఫీలవుతున్నారు.ప్రభాస్ గురించి నెగిటివ్ కామెంట్లు చేసేవాళ్లు తప్పు చేశామని ఏదో ఒకరోజు ఫీలవుతారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ ప్రీ పోన్ అయ్యే అవకాశం కూడా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.